Chanakya Niti Woman: చాణక్య నీతి: ఎలాంటి స్త్రీని భార్యగా పొందితే మంచిదో తెలుసా

విద్యావంతురాలైన స్త్రీలు సంస్కారవంతులు, సత్ప్రవర్తన కలిగిన స్త్రీలు ఆత్మవిశ్వాసంలో ముందుంటారు. వారు చేసే పనులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. విపత్కర పరిస్థితుల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు. ముందుచూపుతోనే వ్యవహరిస్తారు. మంచి విజయాలు అందుకునేందుకు సిద్ధంగా ఉంటారు.

  • Written By: Shankar
  • Published On:
Chanakya Niti Woman: చాణక్య నీతి: ఎలాంటి స్త్రీని భార్యగా పొందితే మంచిదో తెలుసా

Chanakya Niti Woman: ఆచార్య చాణక్యుడు రాజనీతి వేత్త, ఆర్థిక వేత్త, రాజకీయ వేత్త. తన తెలివితేటలతో మగధ సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు ముఖ్య కారకుడు. చంద్రగుప్తుడిని రాజుగా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మానవ జీవితంపై అనేక విషయాలు చెప్పాడు. తన నీతి శాస్త్రంలో స్త్రీల గురించి చాలా విషయాలు ప్రస్తావించాడు. పురుషుడి జీవితం విజయవంతం కావాలంటే జీవిత భాగస్వామికి ఏ లక్షణాలు ఉండాలో సూచించాడు.

చదువుకున్న స్త్రీలు

విద్యావంతురాలైన స్త్రీలు సంస్కారవంతులు, సత్ప్రవర్తన కలిగిన స్త్రీలు ఆత్మవిశ్వాసంలో ముందుంటారు. వారు చేసే పనులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. విపత్కర పరిస్థితుల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు. ముందుచూపుతోనే వ్యవహరిస్తారు. మంచి విజయాలు అందుకునేందుకు సిద్ధంగా ఉంటారు.

మంచి సంభాషణలు

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. మంచిగా మాట్లాడే స్త్రీలు ఇంట్లో ఆనందం కలిగించేందుకు ప్రయత్నిస్తారు. ఇంట్లో మంచి వాతావరణం కలిగేలా చేస్తారు. కుటుంబంలో కీర్తి ప్రతిష్టలు పెరిగేందుకు దోహదపడతారు. కుటుంబ గౌరవం పెంచేందుకు తహతహలాడతారు. మంచి అనుబంధాలు పెంచుకుని సంఘంలో మంచిపేరు గడిస్తారు.

కోరికలు అదుపులో..

సహజంగా స్త్రీలకు కోరికలు ఎక్కువ. వారికి ఉండే ఆశలు వేరుగా ఉంటాయి. కానీ కొందరు స్త్రీలు పరిస్థితులను అర్థం చేసుకుంటారు. మగవాడికి చేదోడు వాదోడుగా నిలుస్తారు. అలాంటి స్త్రీ దొరికిన వాడు ఎంతో పుణ్యం చేసుకున్నవాడు. కష్టకాలంలో తోడుండే స్త్రీలు కూడా ఉంటారు. అది వారివారి నైతికతను బట్టి ఉంటుంది. భర్తల అడుగుజాడల్లో నడిచే వారు కుటుంబానికి ఎంతో గుర్తింపు తీసుకొస్తారు.

మంచి స్వభావం

చాణక్య నీతి ప్రకారం మంచి స్వభావం కలిగిన స్త్రీలు అన్నింట్లో ముందుంటారు. వ్యక్తి జీవితాన్ని తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారు. స్త్రీలు ఆనందాన్ని శాంతిని ప్రేమిస్తారు. ప్రశాంతమైన స్వభావంతో ఉండటం వల్ల ఆ కుటుంబంలో చిక్కులు రాకుండా ఉంటాయి. మంచి ప్రవర్తన వల్ల ఇంట్లో ఆనందాలు కూడా వెల్లి విరుస్తాయి.

సంబంధిత వార్తలు