Chanakya Niti Success: చాణక్య నీతి: జీవితంలో ఎలా ముందుకెళ్లాలో తెలుసా?
చాణక్యుడు సూచించిన మార్గాల్లో స్వధర్మ ఒకటి. అంటే ఆంగ్లంలో మన టాలెంట్. మనలో ఉన్న శక్తుల ప్రకారమే మనం నడుచుకోవాలి. మనకు దేని మీద అభిరుచి ఉంటే ఆ రంగంలోనే మనం ముందుకెళ్లాలి.

Chanakya Niti Success: ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు చెప్పాడు. నాలుగు వందల ఏళ్ల క్రితం అతడు సూచించిన మార్గాలు నేటికి అనుసరణీయమే. అంటే ఎంతటి ముందుచూపుతో అతడు వ్యవహరించాడు. అందుకే అంతటి చాతుర్యం ప్రదర్శించాడు. జీవితంలో ఎదిగేందుకు ఎన్నో దారులు చూపించాడు. అతడు చూపించిన మార్గాలే నేటికి మనం అనుసరిస్తున్నామంటే ఎంతటి ప్రతిభ కలవాడో అర్థమవుతుంది.
చాణక్యుడు సూచించిన మార్గాల్లో స్వధర్మ ఒకటి. అంటే ఆంగ్లంలో మన టాలెంట్. మనలో ఉన్న శక్తుల ప్రకారమే మనం నడుచుకోవాలి. మనకు దేని మీద అభిరుచి ఉంటే ఆ రంగంలోనే మనం ముందుకెళ్లాలి. కానీ ఏదో బతుకుదెరువు కోసం ఏ పని అయినా చేయాలి అని కాంప్రమైజ్ అయితే కష్టం. మనం జీవితంలో ఎదగలేం అని సూచించాడు.
మనం అనుకున్న రంగంలోనే అవకాశాలు వెతుక్కోవాలి. అవసరమైతే మనమే అవకాశాలు కల్పించాలి. ఇలా అయితే మనం ముందుకెళ్లడం ఖాయం. అంతేకాని నేను ఎంచుకున్న రంగంలో డబ్బులు రావు ఇబ్బందులే అని వెనకడుగు వేయకూడదు. జీవితంలో ఒకసారి వెనుకకు అడుగేస్తే ఇక ముందుకెళ్లడం కష్టం. అక్కడే ఆగిపోతాం. అందుకే ముందుకెళ్లడమే నేర్చుకోవాలి. ముందుకే వెళ్లాలి.
సొంత రంగంలో అనుకున్నది సాధించిన వారు చాలా మంది ఉన్నారు. వారి పుస్తకాలు ఓ సారి చదవండి. వారి జీవిత లక్ష్యాలు పరిశీలించండి. మనలో ఉన్న టాలెంట్ ను బయటకు తీసి దాన్ని ప్రపంచానికి పరిచయం చేయండి. అప్పుడే మనలో కూడా మంచి ప్రతిభ ఉందనే విషయం మనకు బోధపడుతుంది. దీనికి మనలో ఆత్మవిశ్వాసం ఉండాలి. సాధించాలనే తపన ఉండాలి. దీంతో ఏదైనా సాధ్యమే అవుతుంది. ఇలా చాణక్యుడు తన పుస్తకంలో ఎన్నో విషయాలు వివరించాడు.
