Chanakya Neeti : జీవితంలో కష్టాలు రాకూడదంటే దేన్ని అదుపులో ఉంచుకోవాలి?
Chanakya Neeti : ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విసయాలు చెప్పాడు. జీవితంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి వివరించాడు. వాటి నుంచి ఎలా ముందుకు వెళ్లాలో కూడా సూచించాడు. జీవితం ఎవరికి కూడా వడ్డించిన విస్తరి కాదు. ప్రతి ఒక్కరికి ముళ్లబాట ఎదురవుతుంది. దాన్ని దాటుకుని ధైర్యంగా ముందుకు వెళితే ఫలితం వస్తుంది. కానీ అక్కడే ఉంటే మనం దేన్ని సాధించలేం. ఈ నేపథ్యంలో చాణక్యుడు మనిషి విజయం సాధించాలంటే ఏం కావాలో అనే వాటిపై స్పష్టత […]

Chanakya Neeti : ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విసయాలు చెప్పాడు. జీవితంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి వివరించాడు. వాటి నుంచి ఎలా ముందుకు వెళ్లాలో కూడా సూచించాడు. జీవితం ఎవరికి కూడా వడ్డించిన విస్తరి కాదు. ప్రతి ఒక్కరికి ముళ్లబాట ఎదురవుతుంది. దాన్ని దాటుకుని ధైర్యంగా ముందుకు వెళితే ఫలితం వస్తుంది. కానీ అక్కడే ఉంటే మనం దేన్ని సాధించలేం. ఈ నేపథ్యంలో చాణక్యుడు మనిషి విజయం సాధించాలంటే ఏం కావాలో అనే వాటిపై స్పష్టత ఇచ్చాడు.
మనసుపై నియంత్రణ
మనసు మీద నియంత్రణ లేనివాడు జీవితంలో ఏదీ సాధించలేడు. ప్రతి మనిషి పుట్టుకతోనే ఐశ్వర్యంతో పుట్టడు. పేదరికంలో పుట్టడం తప్పు కాదు. పేదరికంలో చావడం తప్పు. భగవంతుడు నీకో అవకాశం ఇస్తాడు. జీవితంలో ఎదగాలని సమయం కేటాయిస్తాడు. అప్పుడే మనం మన మనసును నియంత్రణలో ఉంచుకుని సరైన మార్గంలో ఉంచుకుంటే మంచి ఫలితం వస్తుంది.
అసూయ
ఒక మనిషి ఎదిగే క్రమంలో అతడిపై అసూయ పడుతుంటారు. అలా చేయడం సరికాదు. అతనికంటే మనం ఉన్నతంగా ఎదగాలని కలలు కనడం మంచిది. కానీ అతడిపై అసూయ పడితే మన ఎదుగుదల ఆగిపోతుంది. అతడి పురోగతి పెరుగుతుంది. ఇలా ఒక వ్యక్తిపై ఈర్ష్యాద్వేషాలు పెంచుకునే బదులు అతడి కంటే మనం ఉన్నతంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు.
మంచివారితో స్నేహం
ఆరు నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారని సామెత. మంచివారితో స్నేహం కూడా మనల్ని మంచి మార్గం వైపు నడిపిస్తుంది. దీనికి సజ్జనుల సాంగత్యానికి మనం శ్రద్ధ తీసుకోవాలి. వారితో ఉండేందుకు ప్రయత్నించాలి. దీంతో మనకు కూడా మంచి ఉద్దేశాలు అలవడతాయి. మంచి గుణాలు అలవాటవుతాయి. దీంతో మనం జీవితంలో ఎదిగేందుకు దోహదపడుతుంది.
