Chanakya Neethi Success : చాణక్య నీతి: మనిషి విజయం సాధించాలంటే ఉండాల్సిన లక్షణాలివే..
మనిషి చేసే తప్పులను ఎత్తి చూపాడు. జీవితంలో ఏ తప్పులు చేయకూడదో ఏవి మంచివో ఏవి చెడ్డవో కూడా చాటాడు. తన నీతిశాస్త్రంలో మనిషి ప్రవర్తనపై చాలా విషయాలు సూచించాడు.

Chanakya Neethi Success : జీవితంలో సంపాదించడమెలా? దాన్ని ఎలా ఖర్చు చేయాలి? కష్టాలు వస్తే ఏం చేయాలి? అనే విషయాలపై ఆచార్య చాణక్యుడు తనదైన శైలిలో వివరించాడు. మనిషి డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా ఖర్చు చేయాలి? ఎవరికి దానం చేయాలి అనే వాటిపై కూలంకషంగా చర్చించాడు. మనిషి చేసే తప్పులను ఎత్తి చూపాడు. జీవితంలో ఏ తప్పులు చేయకూడదో ఏవి మంచివో ఏవి చెడ్డవో కూడా చాటాడు. తన నీతిశాస్త్రంలో మనిషి ప్రవర్తనపై చాలా విషయాలు సూచించాడు.
ధర్మబద్ధంగా..
మనిషి జీవించడానికి డబ్బు కావాలి. కానీ అది ధర్మబద్ధంగా సంపాదించాలి. అన్యాయాలు, అక్రమాల ద్వారా సంపాదించిన డబ్బు లెక్కలోకి రాదు. ఆగాన వచ్చింది భోగాన పోతుంది అంటారు. అన్యాయంగా సంపాదించిన డబ్బు ధర్మబద్ధమైనది కాదు. అందుకే అలాంటి డబ్బు పాపంతో కూడుకున్నది. మన శక్తితో సంపాదించిన డబ్బునే మనం వాడుకోవాలి. అక్రమాల ద్వారా వచ్చే డబ్బును సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడమే శ్రేయస్కరం.
నైపుణ్యాల మెరుగు
మనలోని నైపుణ్యాలను మెరుగుపరచుకుంటేనే మనకు తెలివితేటలు పెరుగుతాయి. దీంతో మనం డబ్బు సంపాదించుకోవచ్చు. ఎవరైనా సరే నిరంతర విద్యార్థే. తనకు తెలిసినది గోరంత తెలియాల్సింది కొండంత అనే సూత్రం ప్రకారమే ముందుకెళ్లాలి. అప్పుడే మేథస్సు పెరుగుతుంది. నీలోని నైపుణ్యాలు బయటకు వస్తేనే నీకు గుర్తింపు వస్తుంది. దీంతో నీ సంపాదన పెరుగుతుంది. గౌరవమర్యాదలకు కూడా మంచిది.
విశ్రాంతి వద్దు
మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అది సాధించే వరకు విశ్రమించకూడదు. మన లక్ష్యాలు, గమ్యాలు, ఉద్దేశాలు ఎవరికి చెప్పకూడదు. గోప్యంగా ఉంచుకోవడమే మంచిది. వాటిని బహిర్గతం చేస్తే అనవసరమైన ఇబ్బందులొస్తాయి. మన పురోగతిపై ప్రభావం పడుతుంది. అందుకే మన వ్యక్తిగత వివరాలు ఎవరితో పంచుకోకపోవడమే బెటర్.
సమయపాలన
సమయపాలన కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. ఏ పని చేయాలన్నా క్రమశిక్షణ తప్ననిసరి. లేకపోతే ముందుకు వెళ్లడం కష్టం. మనిషి పురోగతి సాధించాలంటే సమయం ప్రాధాన్యత గుర్తించాలి. అప్పుడే విజయావకాశాలు దక్కుతాయి. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఈ విషయాలు చెప్పాడు. మనిషి జీవితంలో చేయకూడని తప్పులు వివరించాడు.