Chanakya Neeti : ఇలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది
Chanakya Neeti : ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు చెప్పాడు. జీవితంలో ఎలా ఉండాలి? ఎలాంటి వారితో ఎలా ప్రవర్తించాలనే విషయాలు వివరించాడు. ఆనాడు అతడు చూపిన మార్గాలు ఇప్పటికి కూడా మనకు అనుసర ణీయంగా కనిపిస్తున్నాయి. దీంతో అతడి ముందు చూపుకు అందరు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో చాణక్యుడు నీతిశాస్త్రం రచించాడు. అందులో ఎన్నో విధాలుగా మనకు సూచనలు చేశాడు. వాటితో మనం జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయట పడొచ్చు. మనం […]

Chanakya Neeti : ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు చెప్పాడు. జీవితంలో ఎలా ఉండాలి? ఎలాంటి వారితో ఎలా ప్రవర్తించాలనే విషయాలు వివరించాడు. ఆనాడు అతడు చూపిన మార్గాలు ఇప్పటికి కూడా మనకు అనుసర ణీయంగా కనిపిస్తున్నాయి. దీంతో అతడి ముందు చూపుకు అందరు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో చాణక్యుడు నీతిశాస్త్రం రచించాడు. అందులో ఎన్నో విధాలుగా మనకు సూచనలు చేశాడు. వాటితో మనం జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయట పడొచ్చు. మనం ఎలాంటి వారికి సహాయం చేస్తే ఎలాంటి ప్రభావాలు వస్తాయో క్షుణ్ణంగా తెలిపాడు.
మూర్ఖుడు
మనం జీవితంలో ఎవరికి సహాయం చేసినా మంచిదే కానీ మూర్ఖుడికి సహాయం చేయొద్దు. ఒకవేళ మనం చేసినా అది సద్వినియోగం కాదు. మూర్ఖుడు ఏది చేసినా సరిగా ఉండదు. అతడి లక్షణాలే మూర్ఖంగా ఉంటాయి. అందుకే అలాంటి వారికి సాయం చేసినా అది మనకు పెద్దగా ఉపయోగపడదు. అతడికి చేసే సాయం బూడిదలో పోసిన పన్నీరులా మారిపోతుందని చాణక్యుడి వాదన.
ఏడుస్తూ ఉండేవాళ్లు
ఎప్పుడు చూసినా ఏడుపు మొహంతో ఉండే వాళ్లకు సాయం చేయడం కూడా సరైంది కాదు. ఎప్పుడు విచారణగా ఉండే వారికి సంతోషం గురించి పెద్దగా పట్టదు. సంతోషం కలిగినా వారు నవ్వరు. అలాంటి వారికి మనం సాయం చేస్తే దానికి అర్థమే ఉండదు. వారికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ప్రతి దాన్ని నెగెటివ్ భావంతో చూస్తూ నిరంతరం ఏదో పోగొట్టుకున్న వారిలా ఉండటం సహజమే.
వ్యక్తిత్వం లేని వారికి..
వ్యక్తిత్వం లేని స్త్రీలకు సాయం చేయడం కరెక్టు కాదు. వారు సమాజానికి పట్టిన చీడ పురుగుల్లాంటి వారు.ఇలాంటి వారికి డబ్బే ప్రధానం. డబ్బు మీదే వీరికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. భవిష్యత్ తరాలకు వీరు చేటు చేస్తారు. అందుకే వీరికి సాయం చేయడం వల్ల దుర్వినియోగం అవుతుంది. వ్యక్తిత్వం లేని వారికి ఏ సాయం చేసినా అది వ్యర్థమే అవుతుంది. దీని వల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది.
