Chanakya Neeti : పిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?
Chanakya Neeti : ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు చెప్పాడు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతిబంధకాలను ఎలా దాటాలో కూడా సూచించాడు. ఆనాడు అతడు చెప్పిన విషయాలు ఈనాడు మనకు సరిగా సరిపోతున్నాయి. అతడి సూచనలు, సలహాలు మన జీవన మార్గానికి బాసటలుగా నిలుస్తున్నాయి. జీవితంలో మనం ఎలా ముందుకెళ్లాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఎలా నడుచుకోవాలనే వాటిపై వివరించాడు. ఆనాడు అతడి సూచించిన మార్గాలే మనకు నేటికి ఆచరణీయంగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో […]

Chanakya Neeti : ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు చెప్పాడు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతిబంధకాలను ఎలా దాటాలో కూడా సూచించాడు. ఆనాడు అతడు చెప్పిన విషయాలు ఈనాడు మనకు సరిగా సరిపోతున్నాయి. అతడి సూచనలు, సలహాలు మన జీవన మార్గానికి బాసటలుగా నిలుస్తున్నాయి. జీవితంలో మనం ఎలా ముందుకెళ్లాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఎలా నడుచుకోవాలనే వాటిపై వివరించాడు. ఆనాడు అతడి సూచించిన మార్గాలే మనకు నేటికి ఆచరణీయంగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాడు. వాటిని తూచ తప్పకుండా పాటిస్తే మన సంతానం సన్మార్గంలో నడవటం ఖాయం.
సంస్కారం
సంస్కారం లేని వాడు వాసన లేని పువ్వు లాంటి వాడు. సంస్కారం లేకపోతే అతడికి విలువ ఉండదు. మనిషిలో ఉండే సంస్కారమే అతడిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. పిల్లలను పెంచే క్రమంలో వారికి సంస్కారం అలవాటు చేయాలి. ఎదుటి వారితో మనం ప్రవర్తించే తీరునే సంస్కారం అంటారు. సంస్కారం కరువైతే అందరు దూరమవుతారు. మంచి సంస్కారంతో ఉంటే అందరు దగ్గరకొస్తారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నట్లు పిల్లవాడి నైతిక ప్రవర్తన మీదే అతడి సంస్కారం ఆధారపడి ఉంటుంది.
చదువు
విద్య లేని వాడు వింత పశువు అన్నారు. విద్యతోనే వినయం కలుగుతుంది. అందుకే అందరు చదువుకోవాలి. అది మన బతుకుకు ఉపయోగపడాలి. సరిగా చదువుకోకపోతే మనకు విద్య ఉండదు. దీంతో తెలివితేటలు ఉండవు. మంచి విద్యావంతుడు అయితేనే గుణవంతుడుగా మారతాడు. విద్య లేకపోతే ఏమి ఉండదు. భవిష్యత్ అంధకారమే. అందుకే అందరు చదువుకోవాలి. తల్లిదండ్రుల గౌరవం నిలబెట్టాలి. అప్పుడే అతడికి మంచి విలువ కలుగుతుంది.
కంట్రోల్ లో..
గారాభం చేయడం కూడా మంచిది కాదు. పిల్లలను కూడా కంట్రోల్ లో ఉంచాలి. మనం వారి కంట్రోల్ లోకి వెళ్లకూడదు. దీంతో వారిని లాలించే సమయంలో లాలించాలి. దండించే దండించాలి. అప్పుడే అతడి బతుకుపై ఓ అవగాహన వస్తుంది. అంతేకాని ఒకడే కొడుకు అని ఒకతే కూతురు అని అతి గారాభం చేస్తే వారు ఎందుకు పనికి రాకుండా పోతారు. బ్లాక్ మెయిల్ కు దిగి మన చేతే అన్ని పనులు చేయించుకుంటారు. మొండిగా ఉండే పిల్లలను సైతం తమ దారికి తీసుకొచ్చుకోవాలి. తమ మాట వినేలా తల్లిదండ్రులు చేసుకోవాలి.
పనులు అప్పగిస్తూ..
పిల్లలకు అప్పుడప్పుడు కొన్ని పనులు అప్పగించాలి. అప్పుడే వారిలోని పనితనం మనకు తెలుస్తుంది. మనం అప్పగించిన పనులు ఎలా చేస్తున్నారో గమనించాలి. ఎలాంటి ఆటంకాలు లేకుండా చేస్తే మంచిదే. కానీ చెప్పిన పని చేయకుండా ఇతర పనులు చేస్తే కచ్చితంగా దారిలో పెట్టాలి. అప్పగించిన పనులు సరిగా చేసేలా చూడాలి. చిన్నప్పటి నుంచే వారిని ఇలా గాడిలో పెడితే పెరిగాక ఎలాంటి సమస్యలు లేకుండా తన ప నులు తాను చేసుకుంటే మనకు కూడా ముచ్చటగా ఉంటుంది. ఇలా ఆచార్య చాణక్యుడు పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాడు.
