Chanakya Niti Husband Wife: చాణక్య నీతి: భార్యలకు చెప్పకూడని విషయాలేంటో తెలుసా

మనం జీవితంలో ఎంత సంపాదిస్తున్నాం. ఎంత ఖర్చు చేస్తున్నామో భార్యలకు తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే వాటి మీద లెక్కలు వేస్తుంది. డబ్బంతా ఏం చేస్తున్నావని అడిగి గోల చేస్తుంది.

  • Written By: Shankar
  • Published On:
Chanakya Niti Husband Wife: చాణక్య నీతి: భార్యలకు చెప్పకూడని విషయాలేంటో తెలుసా

Chanakya Niti Husband Wife: ఆచార్య చాణక్యుడు జీవితంలో మనం చేయకూడని, చేసే పనుల గురించి ఎంతో వివరంగా చెప్పాడు. ఆనాడు అతడు సూచించిన విషయాలు నేటికి మనకు అనుసరణీయంగానే ఉంటున్నాయంటే అతడు ఎంతగా ఊహించాడో అర్థమవుతోంది. 400 ఏళ్ల కింద చెప్పిన విషయాలు నేటికి మనకు పనికొస్తున్నాయంటే అతడి మేథస్సు ఏమిటో తెలుస్తోంది. అలాంటి చాణక్యుడు భార్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

మనం సంపాదించేది..

మనం జీవితంలో ఎంత సంపాదిస్తున్నాం. ఎంత ఖర్చు చేస్తున్నామో భార్యలకు తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే వాటి మీద లెక్కలు వేస్తుంది. డబ్బంతా ఏం చేస్తున్నావని అడిగి గోల చేస్తుంది. అందుకే మన సంపాదన విషయంలో భార్యలకు నిజం తెలియనివ్వకూడదు. పొరపాటున తెలిసిందో అన్నింటిని లెక్కలేసి ఆరాలు తీసి మనకు నిద్ర లేకుండా చేస్తుంది.

సాయం చేస్తే..

మనం ఎవరికైన సాయం చేయాలంటే భార్యలకు తెలియరాదు. తెలిస్తే ఎందుకు చేశావని నిలదీస్తుంది. ఇలా సాయాలు చేస్తూ పోతే మన సంసారం ఎలా అని ప్రశ్నిస్తుంది. ఆడవారికి తమ స్వార్థమే కావాలి. ఇతరుల బాధలు పట్టవు. అందుకే మనం భార్యల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని చాణక్యుడు ఆనాడే సూచించాడు.

అవమానాలు

మనకు ఏదైనా అవమానం జరిగితే దాన్ని భార్యతో పంచుకోకూడదు. ఇంకా ఎవరితోనూ చెప్పకూడదు. ఇలాంటి విషయాలు పంచుకుంటే అవి అందరికి తెలిసిపోయి మనకు మర్యాద లేకుండా పోతుంది. ఆడవారి నోట్లో ఆవగింజ కూడా దాగదు. అన్నింటిని ఇతరులకు చెప్పనిదే వారికి నిద్ర పట్టదు. అందుకే మనం భార్యల దగ్గర కొన్ని రహస్యాలు చెప్పకూడదు. చెబితే నష్టం మనకే .

సంబంధిత వార్తలు