Chanakya Niti Success: ఆచార్య చాణక్యుడు మనిషి జీవితంలో ఎలా ప్రవర్తించాలనే విషయాలు వివరించాడు. ప్రతి విషయం మీద తనదైన శైలిలో ఎన్నో మార్గాలు సూచించాడు. మనిషి జీవితంలో ఏదైనా సాధించాలంటే ఏం చేయాలనేదానిపై కూడా ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆయన సూచించిన మార్గాలు నేటికి అనుసరణీయంగా ఉన్నాయంటే ఎంత దూరదృష్టితో చెప్పాడే అర్థమవుతుంది. మనిషి ఎదిగే క్రమంలో ఎన్నో అవాంతరాలు వస్తుంటాయి. వాటిని దాటుకునే క్రమంలో ఓర్పు, సహనం ఉండాలని చాటాడు. తాను రచించిన నీతిశాస్రం ద్వారా మనుషులకు అవసరమైన పలు విషయాల మీద పరిశోధనాత్మక సందేశాలు ఇచ్చాడు. మనిషి జీవితంలో విజయం సాధించాలంటే నాలుగు విషయాలను మరిచిపోవద్దని సూచించాడు.

Chanakya Niti Success
ప్రతి మనిషికి క్రమశిక్షణ ఆభరణం లాంటిది. క్రమశిక్షణ లేనివాడు మార్గం లేని వంటివాడు. ప్రతి వాడికి జీవితంలో ఏదో సాధించాలనే తపన ఉంటుంది. దాన్ని నెరవేర్చుకునే క్రమంలో క్రమశిక్షణ ఆయుధం లాంటిది. దాన్ని ఎప్పుడు విడిచిపెట్టినా ఇక విజయం సాధించడం కల్ల. అందుకే క్రమశిక్షణతో మెలిగేవాడు జీవితంలో ఎప్పుడు కూడా ఓటమికి గురికాడు. తాను అనుకున్నది సాధించే వరకు విశ్రమించడు. పక్కదారి పట్టడు. అలా అకుంఠిత దీక్షతో ముందుకెళితేనే జీవితంలో విజయం మన పాదాక్రాంతం అవుతుంది. అంతేకాని పడుకుని కలలు కంటే విజయాలు సొంతం కావని తెలుసుకోవాలి. మన తలరాతను మార్చేది మన చేతలే కాని చేతి మీద ఉన్న గీతలు కాదనే విషయం తెలుసుకోవాలి.
ప్రతి ఒక్కరు గెలిచేందుకు ప్రయత్నిస్తారు. ఓటమి రావాలని ఎవరు కోరుకోరు. కొన్ని సందర్భాల్లో ఓటమి కలిగినప్పుడు బాధ పడకూడదు. కుంగిపోకూడదు. ఓటమికి కుంగిపోయేవాడు విజయానికి అధికంగా ఆనందించేవాడికి కష్టాలు రావడం సహజం. అంతమాత్రాన ఏదో జరిగిందని బెంగ పడరాదు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్లీ ప్రయత్నించాలి. విజయం సాధించే వరకు అలుపు లేకుండా కృషి చేస్తే విజయం తప్పకుండా వరిస్తుంది. విజయంలోనే కిక్కుంటుంది.
మనం చేసే పని ధర్మబద్ధమైనది అయి ఉండాలి. అన్యాయంతో విజయం సాధించాలనుకోవడం కూడా సరైంది కాదు. ఏది చేసినా పది మందికి నష్టం జరగకుండా ఉండేదే ధర్మబద్ధమైనది. అంతేకాని అసాంఘికమైన పని ఎంచుకుని అందులో విజయం సాధించాలని చూడటం మూర్ఖత్వమే. మనం చేసే పని మనతో పాటు ఇతరులకు కూడా మేలు కలిగేదిగా ఉంటే బాగుంటుంది. అధర్మమైన పనికి పూనుకోవడమే మంచిది కాదు. అందుకే మనం చేసే పని కచ్చితంగా సమాజానికి ఉపయోగపడేదిగా ఉంటే సరి.

Chanakya Niti Success
మనిషికి సోమరితనం ఉండకూడదు. బద్ధకం ఉంటే ఏ పని చేయబుద్ధి కాదు. సోమరితనం ఉన్న వ్యక్తి పనులు చేయకుండా ఎప్పుడు వాయిదా వేస్తుంటాడు. దీంతో విజయం మీకు దక్కదు. దీంతో ఇంకా కుంగిపోతుంటారు. వీలైనంత వరకు బద్ధకాన్ని దూరం పెట్టాలి. చురుకుదనం, చలాకీతనం ఉంటేనే మనకు విజయం దక్కుతుంది. అంతేకాని హాయిగా పడుకుని నాకు విజయం దక్కడం లేదంటే లాటరీ టికెట్ కొనకుండా నాకు లాటరీ తగలాలని కోరుకోవడం సమంజసం కాదు. కష్టే ఫలి అన్నారు కానీ పని చేయకుండా విజయం మాత్రం సిద్ధించదు.