సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా వచ్చిన సినిమా ‘లవ్ స్టోరీ’. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. పైగా సినిమాకి కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. అయితే, ఒకరోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్స్ షోస్ అమెరికాలో పడ్డాయి.
మొత్తం 224 లొకేషన్లలో ఈ సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. మొత్తానికి భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఒక్క ప్రీమియర్ షోలకు మాత్రమే 3,07,103 డాలర్స్ రావడం విశేషం. ఇక మొదటి రోజు కలెక్షన్స్ మొత్తం 2,34,000 డాలర్స్ వచ్చాయి. కరోనా సెకండ్ వెవ్ తర్వాత అమెరికాలో ఒక ఇండియన్ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం రికార్డే.
మొత్తానికి లవ్ స్టోరికి జరిగిన భారీ బిజినెస్ కి తగ్గట్టుగానే కలెక్షన్స్ రావడం, కరోనా కాలంలో అత్యధికంగా డాలర్స్ ను అందుకున్న ఇండియన్ సినిమాగా కూడా లవ్ స్టోరీ నిలవడం.. చైతు పేరిట నమోదు అయిన సరికొత్త రికార్డు అనుకోవచ్చు ఇది.
పైగా ఇంతకుముందు విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రికార్డును కూడా చైతు లవ్ స్టోరీ బ్రేక్ చేసింది. వకీల్ సాబ్ ప్రీమియర్స్‌కు 300215 డాలర్స్ వచ్చాయి. అదే లవ్ స్టొరీ ప్రీమియర్స్ తో కలుపుకుని మొత్తంగా 540000 డాలర్స్ వచ్చాయి. ఓవరాల్ గా రూ.4.40కోట్ల రూపాయలు వచ్చాయి. మొత్తమ్మీద పవన్ కళ్యాణ్ రికార్డ్ బ్రేక్ చేసిన చైతు.
ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అవ్వడానికి కారణం.. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీనే. ఇద్దరు తమ పాత్రలకు ప్రాణం పోశారు. లవ్ సీన్స్ నుంచి ఎమోషనల్ సన్నివేశాల వరకూ తమ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నారు.