Nagarjuna- Naga Chaitanya: అది దూరం అయ్యింది నాగ చైతన్య ఫుల్ హ్యాపీ నాకది చాలు… నాగార్జున కీలక వ్యాఖ్యలు!
Nagarjuna- Naga Chaitanya: సమంత-నాగ చైతన్య విడాకులు ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. ఈ జంట విడిపోయి ఏడాది అవుతున్నా జనాల్లో ఆసక్తి తగ్గలేదు. అక్కినేని హీరోలు ఎక్కడికెళ్లినా వాళ్ళను ఇవే ప్రశ్నలు వేధిస్తున్నాయి. కింగ్ నాగార్జున మరోసారి సమంత-నాగ చైతన్య విడాకులపై స్పందించారు. ఆయన నటించిన బ్రహ్మాస్త్రం మూవీ ఇటీవల విడుదలైంది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న బ్రహ్మాస్త్రం ఓపెనింగ్స్ భారీగా రాబట్టింది. ఈ క్రమంలో ముంబైలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో నాగార్జున […]

Nagarjuna- Naga Chaitanya: సమంత-నాగ చైతన్య విడాకులు ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. ఈ జంట విడిపోయి ఏడాది అవుతున్నా జనాల్లో ఆసక్తి తగ్గలేదు. అక్కినేని హీరోలు ఎక్కడికెళ్లినా వాళ్ళను ఇవే ప్రశ్నలు వేధిస్తున్నాయి. కింగ్ నాగార్జున మరోసారి సమంత-నాగ చైతన్య విడాకులపై స్పందించారు. ఆయన నటించిన బ్రహ్మాస్త్రం మూవీ ఇటీవల విడుదలైంది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న బ్రహ్మాస్త్రం ఓపెనింగ్స్ భారీగా రాబట్టింది. ఈ క్రమంలో ముంబైలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విలేకరి విడాకుల తర్వాత నాగ చైతన్య మానసిక పరిస్థితి ఏమిటని అడిగారు? దానికి నాగార్జున ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

Nagarjuna- Naga Chaitanya
విడాకుల తర్వాత వాడు(నాగ చైతన్య) చాలా హ్యాపీగా ఉన్నాడు. నాకు అది చాలు. సమంతతో విడాకులు కావడం దురదృష్టకరం. అయినప్పటికీ దాని గురించి ఎల్లకాలం ఆలోచిస్తూ ఉండలేం. ఆ అధ్యాయం ముగిసింది. ఇక దాని గురించి మర్చిపోయాం.మీరు కూడా మర్చిపోండి. ఆ బాధ దూరం అయ్యింది. అని నాగార్జున సమాధానం చెప్పారు. జీవితంలో భాగస్వామితో విడిపోయే పరిస్థితి రావడం బ్యాడ్ లక్ అన్న నాగార్జున. ఒకవేళ జరిగితే మనం ఏమీ చేయలేం. దాని గురించి మర్చిపోవడమే మంచిదని పరోక్షంగా తెలియజేశారు.
నాగార్జున కూడా మొదటి భార్య దగ్గుబాటి లక్ష్మీతో విడిపోయారు. నాగ చైతన్య పుట్టాక ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తి విడాకులు తీసుకున్నారు. ఆ సెంటిమెంట్ నాగ చైతన్యను వెంటాడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతతో నాలుగేళ్ల కాపురం తర్వాత నాగ చైతన్య విడిపోయారు. సమంత-నాగ చైతన్య మధ్య చాలా పెద్ద వివాదం నడిచిందనేది వాస్తవం. దానికి వాళ్ళ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ కారణం. విడిపోయాక కూడా ఒకరంటే మరొకరు కత్తి దూస్తున్నారు. పరోక్షంగా సోషల్ మీడియాలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.

Nagarjuna- Naga Chaitanya
ఆ మధ్య నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పుకార్ల వెనుక సమంత పిఆర్ టీమ్ ఉందన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ వార్తలను సమంత నేరుగానే ఖండించింది. సదరు రూమర్స్ పై ఫైర్ అవుతూ సమంత ట్వీట్ చేశారు. అదే సమయంలో విడాకుల తర్వాత సమంత ఎదుర్కొన్న ఆరోపణలు, నిందలు వెనుక నాగ చైతన్య ఉన్నాడని ఆమె బలంగా నమ్ముతున్నారు. ఇక విడాకుల వ్యవహారంలో సమంత లెక్కకు మించిన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమెకు అఫైర్స్ అంటగట్టారు. కాగా 35 ఏళ్ల సమంత ఇకపై పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యారట.
