ఆకట్టుకుంటున్న సెలబ్రెటీల క్రిస్మస్ వేడుకలు..!
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఈసారి కరోనా మహమ్మరి ప్రభావంతో కొన్నిదేశాలు క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నాయి. మరికొన్ని దేశాలు కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకుంటున్నాయి. ప్రపంచంలోని పలుదేశాలతో భారత్ లోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ సంబరాలు నిన్నటి నుంచే మొదలయ్యాయి. చర్చిలన్నీ విద్యుద్దీపాల వెలుగులను పంచుకుతున్నాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలబ్రెటీలంతా ప్రజలకు.. అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. క్రిస్మస్ సంబరాలకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను […]

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఈసారి కరోనా మహమ్మరి ప్రభావంతో కొన్నిదేశాలు క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నాయి. మరికొన్ని దేశాలు కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకుంటున్నాయి.
ప్రపంచంలోని పలుదేశాలతో భారత్ లోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ సంబరాలు నిన్నటి నుంచే మొదలయ్యాయి. చర్చిలన్నీ విద్యుద్దీపాల వెలుగులను పంచుకుతున్నాయి.
క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలబ్రెటీలంతా ప్రజలకు.. అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. క్రిస్మస్ సంబరాలకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
క్రిస్మస పండుగ ‘మీ జీవితంలో ఆనందాన్ని.. సంతోషాన్ని నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. క్రిస్మస్ రోజును ఫ్యామిలీతో కలిసి ఆనందంగా జరుపుకోండి.. కొత్త సంవత్సరం మరింత కొత్తగా ఉండబోతుందంటూ’ మెగాస్టార్ ట్వీట్ చేశారు.
https://twitter.com/KChiruTweets/status/1342311724913856512?s=20
‘వేడుకలు జరుపుకుంటున్న అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.. ఈ క్రిస్మస్ మీకు శాంతి.. ఆనందం.. ప్రేమను పరిపూర్ణంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను.. మీ సంతోషాన్ని.. ప్రేమను ప్రతి ఒక్కరికీ పంచండి’ అంటూ ప్రిన్స్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
Merry Christmas to all of you! Spread some cheer… Let this be a beautiful day of giving and sharing. Wishing you all peace, love, and joy! ✨ pic.twitter.com/Z92nF6hC35
— Mahesh Babu (@urstrulyMahesh) December 25, 2020
‘ప్రతి ఒక్కరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.. ఈ క్రిస్మస్ శాంతి.. ఆనందం.. ప్రేమను పంచాలని కోరుకుంటున్నట్లు హీరోయిన్ అను ఇమ్మాన్యుయల్ తన ఇన్ స్ట్రాలో పోస్టు చేసింది.
టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ సెలబ్రెటీలు సైతం అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో క్రిస్మస్ సంబరాలకు సంబంధించిన పిక్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రాలు ఫ్యామిలీతో క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్న పిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
