CBI – YS Avinash Reddy : జనంలో జోక్ గా మారిన CBI
వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ తీరు చూస్తే సీబీఐ అభాసుపాలవుతోంది. వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ ఎందుకు వెనుకాడుతోంది. సీబీఐని జోక్ గా చేసి అవినాష్ రెడ్డి ఆడుకుంటున్నారు. సీబీఐ ఒక జోకర్ సంస్థగా జనంలో ఫోకస్ అయ్యింది.

CBI – YS Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద హల్ చల్ చేస్తున్నారు. సోమవారం నాటి సీబీఐ విచారణకు హాజరుకాలేనంటూ అవినాష్ రెడ్డి లేఖతో కలకలం చోటుచేసుకుంది. ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ తప్పదని ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే సీబీఐ అధికారులు పావులు కదపడంతో స్థానిక మీడియా ప్రతినిధులు అలెర్టయ్యారు.
ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత విశ్వభారతి ఆస్పత్రి వద్ద కెమెరాలతో మొహరించారు. అటు కడప, కర్నూలు జిల్లాలకు చెందిన వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్నంతగా పరిస్థితి నెలకొంది.
ఆస్పత్రిలోకి ఎవరూ వెళ్లకుండా వైసీపీ శ్రేణులు వలయంగా ఉన్నారు. దీంతో ఆరుబయటే మీడియా ప్రతినిధులు వేచి ఉన్నారు. సరిగ్గా అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో పది నుంచి 15 మంది రౌడీలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఏయ్ ఎవరు నువ్వు? నీది ఏ పేపర్? ఏ చానల్? అని ప్రశ్నిస్తూ. బూతులు తిడుతూ విలేకరుల వెంటపడ్డారు. ఈటీవీ రిపోర్టర్ రెడ్డి…ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వెంకటేష్, కెమెరామెన్స్ నగేష్,చంద్రశేఖర్ లపై దాడిచేశారు. కెమెరాలను ధ్వంసం చేశారు. కొందర్నైతే పక్కకు లాక్కెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. సెల్‌ఫోన్ లాక్కున్నారు. అందులోని ఫొటోలను డిలిట్ చేశారు.అక్కడున్న మీడియా ప్రతినిధులందరినీ తరిమేశారు. కొందరిని సమీపంలో ఉన్న టీ బంకులోకి తీసుకెళ్లి.. షట్టర్ మూసి తాళం వేశారు. కొద్దిసేపటి తర్వాత బయటికి వదిలి… ఆసుపత్రి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తామంటూ బెదిరించారు.
వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ తీరు చూస్తే సీబీఐ అభాసుపాలవుతోంది. వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ ఎందుకు వెనుకాడుతోంది. సీబీఐని జోక్ గా చేసి అవినాష్ రెడ్డి ఆడుకుంటున్నారు. సీబీఐ ఒక జోకర్ సంస్థగా జనంలో ఫోకస్ అయ్యింది.
దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.