Viveka Case- Ninhydrin Test: వివేకా హత్య కేసును నిన్ హైడ్రిన్ పరీక్ష మలుపు తిప్పనుందా? అసలేంటి ‘నిన్ హైడ్రీన్’

నాలుగేళ్ల క్రితం జరిగిన వివేక హత్య కేసులో అక్కడ దొరికిన లేఖ ఇప్పుడు కీలకంగా మారింది. మరోరకంగా చెప్పాలంటే సాక్ష్యంగా మారనుంది. అనుమానుతుల వేలిముద్రలను గుర్తించడమే ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం. రసాయనిక ప్రయోగం ద్వారా లేఖ పై వేలిముద్రలను కనుగొంటారు. నిన్ హైడ్రీన్ ఫార్ములా సి9, హెచ్6, ఓ4. దీన్ని యథనాల్లో వేసినప్పుడు కరిగిపోతుంది. వివేక రాసిన లేఖపై ఆ ద్రావణాన్ని స్ప్రే చేస్తారు లేదా అందులో ముంచి బయటకు తీస్తారు.

  • Written By: SHAIK SADIQ
  • Published On:
Viveka Case- Ninhydrin Test: వివేకా హత్య కేసును నిన్ హైడ్రిన్ పరీక్ష మలుపు తిప్పనుందా? అసలేంటి ‘నిన్ హైడ్రీన్’

Viveka Case- Ninhydrin Test: వివేక హత్యకేసు విచారణ కీలక మలుపు తీసుకోనుంది. ఈ నెలాఖరులోపు కేసు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన అధికారులు సరైన సాక్షాధారాలను కోర్టు ముందు ఉంచలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాన నిందితుడిగా చెబుతున్న ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేకపోయారన్న అప్రదిష్ట మూటకట్టుకుంది. ఈ క్రమంలో హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన లెటర్ ను నిన్ హైడ్రిన్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐ కోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించిన అనుమతులు లభించాయి.

నిన్ హైడ్రీన్ పరీక్ష అంశాన్ని సీబీఐ అధికారులు కోర్టు ముందు ఉంచగా, నిందితుల తరపు న్యాయవాదులు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఇరువైపు వాదనలను విన్న తర్వాత న్యాయస్థానం నిన్ హైడ్రిన్ పరీక్ష నిర్వహించేందుకు ఒప్పుకుంది. దీని ద్వారా లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని సీఎఫ్ఎస్ఎల్ చెబుతోంది. ఇదే విషయాన్ని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. కోర్టు రికార్డులలో లేఖ కలర్ జిరాక్స్ ను ఉంచేలా అనుమతి ఇవ్వాలని సీబీఐ అభ్యర్థిగా కోర్టు ఓకే చెప్పింది.

ఏమిటి నిన్ హైడ్రీన్ పరీక్ష..

నాలుగేళ్ల క్రితం జరిగిన వివేక హత్య కేసులో అక్కడ దొరికిన లేఖ ఇప్పుడు కీలకంగా మారింది. మరోరకంగా చెప్పాలంటే సాక్ష్యంగా మారనుంది. అనుమానుతుల వేలిముద్రలను గుర్తించడమే ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం. రసాయనిక ప్రయోగం ద్వారా లేఖ పై వేలిముద్రలను కనుగొంటారు. నిన్ హైడ్రీన్ ఫార్ములా సి9, హెచ్6, ఓ4. దీన్ని యథనాల్లో వేసినప్పుడు కరిగిపోతుంది. వివేక రాసిన లేఖపై ఆ ద్రావణాన్ని స్ప్రే చేస్తారు లేదా అందులో ముంచి బయటకు తీస్తారు.

పదినిమిషాల తర్వాత ఆ లేఖ పై ఎక్కడెక్కడ వేలిముద్రంలో ఉన్నాయో ఆ ప్రాంతం ఊదా రంగు కలర్ లోకి మారిపోతుంది. దాన్నిబట్టి నిందితులెవరో తెలుసుకోవచ్చని సీబీఐ చెబుతోంది. నాలుగేళ్ల క్రితం హత్య జరిగిన తర్వాత ఆ లేఖను ఎంతో మంది పట్టుకున్నారు. పోలీసులు, సీబీఐ అధికారులు, కుటుంబీకులు పరిశీలించారు. వీరందరి వేలిముద్రలు ఆ లేఖపై పడి ఉంటాయి. దాంతో అసలు నిందితులెవరో తెలుసుకోవడం చాలా క్లిష్టమైన అంశంగా మారనుంది. ఏది ఏమైనప్పటికీ నిన్ హైడ్రీన్ పరీక్ష అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube