మోడీ ఆప్యాయంగా పవన్ ను పలకరించారు. మోడీ పవన్ భేటిపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఆమంచి స్వామి వచ్చి జనసేనలో చేరారు. రేపు పంచకర్ల రమేష్ వచ్చి చేరుతున్నారు. అన్నీ సవ్యంగా కుదిరితే.. పెద్ద సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ కూడా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి.
పవన్ లో నాయకత్వ లక్షణాలు బాగా ఉన్నాయి. పవన్ సెలబ్రెటీ కావడంతో వస్తున్నారంటే తప్పు. జనంలో మార్పు వచ్చింది. పవన్ మాట్లాడేది భిన్నంగా.. ఆలోచనాత్మకంగా ఉంది. జాతీయ భావాలతో ప్రాంతీయ అంశాలతో పవన్ మాట్లాడుతున్నారు.
పాలన విధానం, వైఫల్యాలను ఎండగడుతున్నారు. ముఖ్యంగా జగన్ ఆయువుపట్టులపై ఫోకస్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో ఏ వ్యవస్థల ద్వారా గట్టెక్కాలని చూస్తున్నారో వారినే టార్గెట్ చేసుకున్నారు,
దీంతో ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి పూజలు చేస్తున్న ఫొటోను రిలీజ్ చేశారు. దీంతో వైసీపీ బ్యాచ్ విమర్శలకు ముకుతాడు పడింది. అయితే జగన్ లూప్ హోల్స్ తెలియక కాదు.. పవన్ కళ్యాణ్ కు సభ్యత అడ్డు వచ్చి అలాంటి విమర్శలు చేయడం లేదు. వైసీపీలా నీచ రాజకీయాలు చేయడం లేదు.
పవన్ కళ్యాణ్ మొదటి విడత వారాహి యాత్ర పూర్తయ్యింది. 10 నియోజకవర్గాలు.. 17 రోజులు సాగింది. 14వ తేదీ అన్నవరంలో బయలు దేరి 30వ తేదీ భీమవరంలో ముగిసింది. వారాహి యాత్రకు ముందు ఇది ఎలా జరుగుతుందన్న ఒక ఉద్వేగం ఉండేది. కానీ యాత్ర పూర్తయిన వేళ పవన్ కళ్యాణ్ కు జన నీరాజనం పలికారు. జనాలు పవన్ కళ్యాన్ హారతులతో స్వాగతించారు
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ ఎదిగారు. తండ్రి చనిపోతే శవాన్ని పక్కనపెట్టుకొని ముఖ్యమంత్రి కావాలని సంతకాలు చేయించారు. 16 నెలలు జైలు జీవితం గడిపారు. ఇది మీ ట్రాక్ రికార్డ్. సొంత చెల్లెలు షర్మిల మీ పార్టీని కాపాడితే ఆమె తన్ని తరిమేశారు. సొంత బాబాయి హత్య జరిగితే హంతకులను ఇంతవరకూ పట్టుకోలేదు
పవన్ కళ్యాణ్ భావాలు, ఆలోచనలు గోదావరి తీరాన్ని బలంగా తాకాయి. అందుకే పవన్ పై అభిమానం వెల్లివిరుస్తోంది. కులాలు, మతాలకు అతీతమైన మానవతావాదం.. నేర ప్రవృత్తి గల వారిపై ఆగ్రహాన్ని ఒడిసిపట్టిన విధానం.. స్తానిక సమస్యలపై పవన్ సాధించిన పట్టు.. దేశభక్తి, జాతీయ భావాల పెంపొందించడం కూడా పవన్ కళ్యాణ్ పై జనాదరణకు కారణం అవుతోంది.
తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యమాన్ని బంద్ చేసి ముద్రగడ ఇంట్లో కూర్చున్నారు. ఉద్యమాన్ని శంకించారంటూ కారణం చెప్పి ఇంటికే పరిమితమయ్యారు. అనుకున్నట్టు వైసీపీ సర్కారు వచ్చింది కాబట్టే ముద్రగడ ఉద్యమం నుంచి తప్పుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.
మొట్టమొదటి సారి దేశభక్తిని ప్రేరేపించే ప్రాంతీయ పార్టీని చూస్తున్నాం. ప్రతీ సందర్భంలోనూ దేశ నాయకులను, అమరవీరులను వారి త్యాగాలను గుర్తు చేస్తున్నాడు. అది ప్రపంచ నాయకుడు అయిన చేగువేరా అయినా..
ఇక కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్‌కు అభిమానులు కరావలం(కత్తి) బహూకరించారు. వారాహి వాహనంపై నిలబడిన జనసేనాని దానిని తిప్పుతు అభిమానుల్లో ఉత్సాహం నింపారు. పవన్ కత్తి పట్టగానే సభా ప్రాంగణం సీఎం.. సీఎం అనే నినాదాలతో హోరెత్తింది.
స్వతహాగా వైఎస్ వివేకా కూతురు డాక్టర్. అయినా నిన్న తన కేసును తనే వాదించుకుంది. తన తండ్రికి న్యాయం చేయమని సుప్రీంకోర్టు జడ్జీలను అర్థించింది. ఇలాంటివి అరుదైనవి. చాలా తక్కువ కేసుల్లో ఇలా జరుగుతుంది. ఇది వినడానికే వినూత్నంగా ఉంది.
ఏదో ఒక విధంగా ఈ కేసులోంచి బయటపడాలన్న తపన తాపత్రయం పెరిగిపోయింది. అందుకే రామోజీరావు తరుఫున లాబీయింగ్ చేసే పెద్దమనిషి చంద్రబాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమిత్ షాపై చంద్రబాబు ఒత్తిడితోపాటు రిక్వెస్ట్ చేసే అవకాశాలు ఉంాయని తెలుస్తోంది.
యాత్ర ఒకేవిడతగా కాకుండా పలు విడతలుగా చేయనున్నారు. దీంట్లో భాగంగా మొదటి విడత అన్నవరం నుంచి భీమవరం వరకు యాత్ర కొనసాగుతుందని నాదెండ్ల తెలిపారు.
Chandrababu Naidu Manifesto : మహానాడులో చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అవన్నీ అమలు చేయాలంటే జగన్ చేస్తున్న ఖర్చు కంటే ఎక్కువ అవుతున్నాయి. అయితే చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో చూస్తే జగన్ హామీలు, కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు, బీహార్ లో ఎన్నికల హామీలను కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ మేనిఫెస్టోగా రూపొందించారు. జగన్ కు ధీటుగా తన అమ్ముల పొది నుంచి మినీ మేనిఫెస్టో ఒకటి బయటకు తీశారు. ఓట్లు రాబెట్టే తారకమంత్రంగా […]
2019కి.. 2024 వరకూ చూసుకుంటే.. జనసేన గ్రామ గ్రామానికి జనసేన విస్తరించింది. కోర్ బేస్ గా ఉన్న జనసేన అభిమానులు ఈరోజు పవన్ పైనే విశ్వాసం చూపిస్తున్నారు. ఆయనే మా నాయకుడు ఆయన రావాలని కోరుకుంటున్నారు.
జగన్ పై ఎన్నో కేసులు, చార్జీషీట్లు ఉన్నాయి. అయినా విచారణ జరగడం లేదు. అవినాష్ రెడ్డి వ్యవహారంలోనూ జగన్ కు ఇప్పుడు మోడీ, అమిత్ షా కు మద్దతుగా కేంద్రం నిలుస్తోంది. దీనిపై అందరికీ జుగుప్సా కలుగుతోంది.
రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం.. ఈ ఐదు రాష్ట్రాలకు వచ్చే డిసెంబర్ లోనే ఎన్నికలు జరుగబోతున్నాయి.. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయా రాష్ట్రాల్లో అందివచ్చే అందరినీ కలుపుకొని పోవాలని కాంగ్రెస్ సమాయత్తమవుతోంది.