విజయసాయిరెడ్డి కొంత కాలం మౌనాన్ని ఆశ్రయించడంతో ఆయన బాధ్యతలు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేతుల మీదుగా జరిగాయి. రాష్ట్రస్థాయిలో తనకు తోడుగా వుండాలని సీఎం జగన్ ఆదేశాల మేరకు, చంద్రగిరిని కుమారుడు మోహిత్‌రెడ్డికి అప్పగించినట్టు ఇటీవల ఆయన ప్రకటించారు.
మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ గుండెపోటుకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు.
రోజంతా కరెంటు ఇస్తున్నామని గొప్పలకు పోతూ... ఆ భారమంతా జనంపైనే వేస్తున్నారు. సర్దుబాటు చార్జీలకు తోడు ఇంధన సర్‌చార్జీ, కన్జ్యూమర్ చార్జీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఇలా రకరకాల పేర్లతో సగటు వినియోగదారుడికి షాకిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి విధ్వంసం చేయలేదన్నారు. టీడీపీ నాడు ప్రారంభించిన అభివృద్ధిని ఆపలేదన్నారు. ఏపీ ముఖ్యమంత్రి అభివృద్ధి జరగకుండా విధ్వంసానికి పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
మార్గదర్శకి ఆయువు పట్టయిన ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచ్ కార్యాలయాల ద్వారా వసూలు చేసిన నిధులను ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టామని ఒప్పుకున్న శైలజ, నిర్దిష్టంగా ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
వచ్చే ఎన్నికల్లో రాపాక గెలుపు అంత ఈజీకాదు. కాపులు ఎక్కువగా ఉండే రాజోలులో జనసేనకు పట్టు ఎక్కువ. పైగా జనసేన అధినేతను నమ్మించి మోసం చేశారని రాపాకపై జనసేనతో పాటు కాపుల్లో ఆగ్రమం పెల్లుబికుతోంది. అందుకే జగన్ పై ఎంత వీర విధేయత, భక్తి చాటుకున్నా రాజోలులో రాపాకను గెలిపించలేరని శపధం చేస్తున్నారు.
బుధవారం జరిగే కేబినెట్ మీటింగులో ఏదో సంచలన ప్రకటన వచ్చే చాన్స్ ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
గుంటూరు పార్లమెంట్ స్థానంలో కాపులు అధికం. వైసీపీ ఒకసారి కాపు, మరోసారి రెడ్డి సామాజికవర్గానికి టిక్కెట్ ఇచ్చి చేతులు కాల్చుకుంది. ఈసారి మాత్రం కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాయుడును పోటీచేయించేందుకు నిర్ణయించింది.
సుప్రీం వెకేషన్ బెంచ్ సునీత పిటిషన్‌ను విచారించే అవకాశం ఉంది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్‌కు ఊరటనిచ్చే తీర్పు ఇవ్వగా, సర్వోన్నత న్యాయస్థానం వెకేషన్ బెంచ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ.
రాయలసీమలో మరిన్ని సీట్లు సాధించేందుకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. అందు కోసం బాలక్రిష్ణ సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. అన్నీ కుదిరితే వీలైనంత త్వరగా సినిమాలు ముగించుకొని డిసెంబరులో యాత్రకు బాలయ్య సిద్ధమవుతారని సమాచారం.
అర్హుల పేరుతో ఎవర్నీ ఎలిమినేట్ చేయబోమని… నమ్మకం కలిగించేందుకు ముందుగానే కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. టీడీపీ తాజా నిర్ణయంతో వైసీపీ శ్రేణుల నోటీలో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది.
టీడీపీతో పొత్తునకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అటు టీడీపీ, ఇటు బీజేపీ వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం పొత్తుకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరీ ఏం జరుగుతుందో?
2019లో అధికారంలోకి వచ్చిన జగన్ పోలవరంపై దృష్టిపెట్టారా? అంటే సమాధానమే కరువు. సీఎం హోదాలో ఆయన ఐదుసార్లు ప్రాజెక్టు బాట పట్టారు.
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర నుంచి పోలీసులను రప్పించడం విశేషం. సీఎంగా జగన్ ఎప్పుడు పోలవరం పర్యటించినా ఇదే పరిస్థితి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2019 జూన్ 20వ తేదీన, అదే ఏడాది నవంబరు 4న, 2020 డిసెంబరు 12న, 2021 జూలై 19న పోలవరం ప్రాంతంలో జగన్ పర్యటించారు.
జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ప్రముఖులు స్వేచ్ఛగా పర్యటనలు సాగిస్తున్నారు. కానీ జగన్ మాత్రం అలా కాదు. చివరకు మావోయిస్టు ప్రాబల్యం ఉన్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో చంద్రబాబు, ఇతర విఐపీలు పర్యటించారు. కానీ వారి పర్యటనల పేరుతో రోడ్డుపై ఉన్న చెట్లను నరికివేయలేదు.
ప్రస్తుతం ఏపీలో విచిత్ర రాజకీయాలు చోటుచేసుకుంటున్నారు. జనసేన మాతోనే ఉందని బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు చెబుతున్నారు. కానీ జనసేన మాత్రం తాము టీడీపీతో ఉన్నామన్న సంకేతాలు ఇస్తోంది. పోనీ బీజేపీని ఎవరూ పట్టించుకోకుండా ఉన్నారంటే అదీ లేదు.
బీజేపీతో పొత్తు పెట్టుకొని 2014లో టీడీపీ పోటీ చేసింది. గెలిచిన తరువాత ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు క్యాబినెట్ లో చంద్రబాబు అవకాశం కూడా కల్పించారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో బీజేపీకి తెలుగుదేశం దూరంగా జరిగింది.