Cashew Health Benefits: జీడిపప్పు తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది
ఎముకల పటుత్వానికి జీడిపప్పు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా మంచి ఆరోగ్య లక్షణాలు కలిగి ఉంది. జీడిపప్పు తినడం వల్ల మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

Cashew Health Benefits: డ్రై ఫ్రూట్స్ లలో బాదంపప్పు, పిస్తాపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరాలు, కిస్ మిస్ లు ఉంటాయి. ఇందులో జీడిపప్పును విరివిగా వాడుతాం. పలు రకాల వంటల్లో కూడా జీడిపప్పు ముఖ్యమైనది. జీడిపప్పును బెస్ట్ సూపర్ ఫుడ్ గా చెబుతారు. జీడిపప్పు మోతాదుకు మించి తీసుకుంటే నష్టాలే వస్తాయి. పరిమితంగానే తీసుకోవడం ఉత్తమం.
ఎముకల పటుత్వానికి జీడిపప్పు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా మంచి ఆరోగ్య లక్షణాలు కలిగి ఉంది. జీడిపప్పు తినడం వల్ల మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఎముకలు పటిష్టంగా మారడానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలో జీడిపప్పు మనకు ఎన్నో రకాల మేలు చేస్తుంది.
థైరాయిడ్, డయాబెటిస్ పేషెంట్లు జీడిపప్పుకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఊబకాయులైతే జీడిపప్పును మానేయడం మంచిది. జీడిపప్పులో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఐరన్ ఊపిరితిత్తుల్లోని సెల్స్ లో పేరుకుపోతే ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. ఇలా జీడిపప్పు తినడంలో ఉన్న జాగ్రత్తలు పాటించాలి.
జీడిపప్పులో ఐరన్, కాల్షియంతో పాటు మెగ్నిషియం ఉంటుంది. జీడిపప్పు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదముంటుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్నవారు జీడిపప్పు తినడం మానేయాలి. దీని జోలికి వెళ్లకూడదు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. మలబద్ధకం సమస్య కూడా ఇబ్బంది పెట్టొచ్చు.