
Kotamreddy Sridhar Reddy
Kotamreddy Sridhar Reddy: అధికార పార్టీలో అసమ్మతి రగిలేశాడు. అధినేతకే సవాల్ విసిరాడు. ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. సమాధానం చెప్పుకోలేని పరిస్థితి కల్పించాడు. ఇక అంతే.. పాత కేసులు, కొత్తకేసులు ఒక్కొక్కటీ బయటికొచ్చేశాయి. కిడ్నాప్, అటెంప్ట్ టు మర్డర్, త్రెటెనింగ్ అంటూ కేసులు మీద కేసులు నమోదైపోయాయి. ఇక అరెస్టులు మాత్రమే మిగిలాయి. అసమ్మతి రగిలేసిన ఆ ఎమ్మెల్యే ఎవరు ? ఆ కేసుల కథేంటో తెలుసుకోండి.
ఏపీలో ఎక్కడ చూసినా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరే వినిపిస్తుంది. ఆయన గురించిన చర్చే జరుగుతోంది. ఎందుకంటే నిండుకుండలా ఉన్న వైసీపీలో ఒక్కసారిగా అలజడి పుట్టించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో అధికార పార్టీని ఇరుకునపెట్టారు. ఊపిరి సలపకుండా చేశారు. ఇంత చేసిన కోటంరెడ్డిని జగన్ ఊరికే వదిలిపెడతారా ?. వదిలిపెట్టరు. జగన్ నైజం తెలిసిన కోటంరెడ్డికి కూడా ఈ విషయం బాగా తెలుసు. కోటంరెడ్డి కూడా బాగానే ప్రిపేర్ అయినట్టు ఉన్నారు. అందుకే అరెస్టు చేసినా , ఎన్కౌంటర్ చేసినా సిద్ధమే అంటూ సవాల్ విసిరాడు. జగన్ కంటే ముందే ఎదురుదాడి ప్రారంభించాడు.
కోటంరెడ్డి వ్యవహారం పై జగన్ సీరియస్ అయ్యాడు. కోటంరెడ్డి సంగతి చూడాల్సిందిగా వందిమాగధులకు సూచన ఇచ్చాడు. ఇక తాడేపల్లి బ్యాచ్ కోటంరెడ్డి పై యాక్షన్ ప్లాన్ రూపొందించింది. అప్పటికప్పుడు కోటంరెడ్డి పై కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డితో కోటంరెడ్డి పై ఫిర్యాదు చేయించారు. తనను కోటంరెడ్డి కిడ్నాప్ చేసి, మర్డర్ చేసే ప్రయత్నం చేశాడని విజయ భాస్కర్ రెడ్డి ఆరోపించారు. తన ఇంటి చుట్టూ గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతున్నారని ఆరోపించారు. తనకు ప్రాణహానీ ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Kotamreddy Sridhar Reddy
విజయభాస్కర్ రెడ్డి ఆరోజు సాయంత్రం ఫిర్యాదు చేశారు. అదే రోజు ఉదయం కోటంరెడ్డిని కలిసి కోటంరెడ్డితోనే తన ప్రయాణం అంటూ ఆవేశంగా మాట్లాడినట్టు కోటంరెడ్డి విలేఖరుల సమావేశంలో చెప్పారు. దీనిని బట్టి చూస్తే వైసీపీ అధిష్టానమే ఉద్దేశపూర్వకంగా కోటంరెడ్డి పై కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇదొక్క కేసే కాదు. పాతకేసులను కూడా వైసీపీ అధిష్టానం తిరగదోడే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ అధిష్టానం కోటంరెడ్డి పై కక్షసాధింపు ఆపేది లేదని ప్రతిన బూనినట్టు అర్థమవుతోంది. ఇక కేసులు నమోదు చేయడం ప్రారంభమైంది. అరెస్టు చేయడమే తరువాయి అన్నట్టు వైసీపీ వ్యవహారం ఉంది. ఇప్పటికే కోటంరెడ్డి కూడా అరెస్టుకు సిద్ధమని తేల్చేశారు. ఇక వైసీపీ ఏం చేయనుందో వేచిచూడాలి.