Dimple Hayathi : ఏసీపీతో గొడవ డింపుల్ హయాతి బాయ్ ఫ్రెండ్‌ను పట్టించింది
తన బాయ్ ఫ్రెండ్ విషయం బయటకు రావడంతో డింపుల్ చాలా అప్‌సెట్ అయినట్టు తెలుస్తోంది. అసలే అంతంతమాత్రంగా సాగుతున్న తన కెరియర్‌లో ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తే ఏమవుతోందనన్న భయం ఆమెను వెంటాడుతోంది.

Dimple Hayathi : డింపుల్ హయాతి.. అప్పుడెప్పుడో గద్దలకొండ గణేష్ సినిమాలో ‘సూపర్ హిట్టూ’ అనే పాట ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయింది. ఆ పాట సూపర్ హిట్ అయినప్పటికీ ఆమెకు ఎందుకో సరైన అవకాశాలు రాలేదు. చాలా కాలం తర్వాత రవితేజ సినిమా ఖిలాడీలో ఓ హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. అందులో ఏకంగా బికినీ వేసి సెగలు పుట్టించింది. కానీ ఆసినిమా కూడా ప్లాఫ్ కావడంతో ఈ విజయవాడ సుందరి డీలా పడిపోయింది. తర్వాత గోపీచంద్ హీరోగా రామబాణం సినిమాలో లీడ్ రోల్‌లో నటించింది. కానీ ఈ సినిమా కూడా అస్సాం వెళ్లిపోవడంతో ఐరన్ లెగ్ ముద్ర వేసుకుంది. పాపమ్ ఇప్పుడు డింపుల్ చేతిలో ఏలాంటి సినిమాలూ లేవు. అయితే అకస్మాత్తుగా ఇప్పుడు ఈమె మీడియాలో నానుతోంది.
డింపుల్ ఉంటే అపార్ట్‌మెంట్‌లో పోలీస్ శాఖకు చెందిన ఏసీసీ రాహుల్ హెగ్డే కూడా ఉంటారు. అయితే వీరిద్దరి కార్లపార్కింగ్ విషయంలో వివాదం ఏర్పడింది. అది చినికి గాలి వానలాగా మారింది. ఏకంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకునేదాకా వెళ్లింది. ఇద్దరూ కోర్టు దాకా కూడా వెళ్లారు. దీంతో మీడియా డింపుల్ మీదగా బాగా ఫోకస్ పెట్టింది. ఆమె ప్రతీ అడుగును నిశితంగా గమనించడం మొదలుపెట్టింది. దీంతో అసలు విషయం బయట పడింది. ఫలితంగా డింపుల్ తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
డింపుల్ తెలుగుమ్మాయే. విజయవాడ ఆమె స్వస్థలం. చదువు పూర్తయ్యాక ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించింది. మొదట్లో వివిధ యాడ్స్ ఫిల్మ్‌లో కన్పించేది. ఆ సమయంలోనే డిజిటల్ టెక్నిషియన్‌గా పని చేస్తున్న డేవిడ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా మారింది. అతడిది కూడా విజయవాడ కావడంతో ఇద్దరి మనసులు కూడా త్వరగానే కలిశాయి. ఇద్దరూ సహజీవనం చేసే దాకా వెళ్లింది. ప్రస్తుతం ఇద్దరూ ఇకటే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఇక ఏసీపీతో గొడవ అయిన నాటి నుంచి డింపుల్ మీడియాలో బాగా కన్పిస్తోంది. మీడియా కూడా బాగా ఫోకస్ చేయడంతో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. తన బాయ్ ఫ్రెండ్ విషయం బయటకు రావడంతో డింపుల్ చాలా అప్‌సెట్ అయినట్టు తెలుస్తోంది. అసలే అంతంతమాత్రంగా సాగుతున్న తన కెరియర్‌లో ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తే ఏమవుతోందనన్న భయం ఆమెను వెంటాడుతోంది.
