Cancer Treatment: క్యాన్సర్ ఒకప్పుడు అరుదుగా కనిపించేది.. ఇప్పుడు చాప కింద నీరులా విస్తరిస్తోంది.. ఆడ, మగ అని తేడా లేకుండా క్యాన్సర్ వ్యాపిస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మరణాలలో క్యాన్సర్ రెండవ స్థానంలో ఉంది. ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ వ్యాధి తీవ్రత ఎంతలా ఉందో… క్యాన్సర్ భయంకరమైన వ్యాధి కానీ దాని నివారణ మన చేతిలో ఉంది.. నేడు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

Cancer Treatment
క్యాన్సర్ సోకుతుందనే భయం ఉన్నవాళ్లు, శరీరాన్ని మొత్తం స్కానింగ్ చేయమని వైద్యులను అడుగుతూ ఉంటారు. శరీరంలో దాగి ఉన్న వ్యాధిని కనిపెట్టి, దాని అంతు చూడాలనే తాపత్రయం వాళ్ళది. కానీ ఒకే ఒక పరీక్షతో అన్ని రకాల క్యాన్సర్ కణాలనూ కనిపెట్టడం సాధ్యం కాదు.. అలాంటి పరీక్షలు ఏవైనా అందుబాటులో ఉన్నప్పటికీ వాటితో కచ్చితంగా క్యాన్సర్ కణాలను కనిపెట్టవచ్చని శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. రక్తంలో ప్రయాణించే ట్యూమర్ కణాలను కనిపెట్టే పరీక్ష కూడా కొత్తగా ప్రచారంలోకి వచ్చింది. కానీ అది అప్పటికే సోకిన క్యాన్సర్ కణాలను మాత్రమే కనిపెట్టగలుగుతుంది.. అంతేతప్ప సోకే అవకాశాలను కనిపెట్టలేదు.. కాబట్టి ముందు నుంచి అనుసరిస్తున్న క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలనే అనుసరించడం ఉత్తమం. రొమ్ము క్యాన్సర్ ను స్వీయ పరీక్షతోనే ముందుగానే కనిపెట్టవచ్చు.. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ను పాప్ స్మియర్, క్లినికల్ ఎగ్జామినేషన్ తో, పెద్దపల్లి క్యాన్సర్ ను మోషన్ ఫర్ ఆకల్ట్ బ్లడ్ పరీక్షతో, లంగ్ క్యాన్సర్ ను ఎక్స్ రే తో, స్మోకర్ల లంగ్ క్యాన్సర్ ను సిటీ స్కాన్ తో ప్రారంభ దశలో కనిపెట్టే వీలుంది.
వంశపారంపర్యంగా క్యాన్సర్స్ సోకే వీలున్న రిస్క్ గ్రూపుకు చెందిన వాళ్లు రెట్టింపు అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవడం అవసరం. బ్రాక ఒకటి, రెండు కోవకు చెందిన క్యాన్సర్ ముప్పు ఉన్నవాళ్ళకు సాధారణ మామోగ్రఫీకి బదులు ఎమ్మారై మోమోగ్రఫి పరీక్ష ఉపయోగపడుతుంది.. 35 నుంచి 40 ఏళ్ల మధ్య మహిళలకు ఈ పరీక్షలో పాజిటివ్ ఫలితం వస్తే, రెండు అండాశయాలతో పాటు ఫెలోపియన్ ట్యూబులను కూడా తొలగిస్తే, రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షణ దక్కుతుంది.. అలాగే చిన్న వయసులోనే శరీరం మీద ఎక్కువ మొత్తాల్లో పులిపిర్లు తలెత్తే వాళ్లు పెద్ద పేగు క్యాన్సర్ ముప్పు ఉందని గ్రహించాలి. ఈ కోవకు చెందిన వాళ్లు క్యాన్సర్ నుంచి తప్పించుకునేందుకు 15 నుంచి 20 వయసుకు చేరుకున్న వెంటనే పూర్తి పెద్ద పేగులు తొలగించుకోవలసి ఉంటుంది.

Cancer Treatment
అలాగే మిడిలరీ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్ కుటుంబ చరిత్ర కలిగి ఉన్న వాళ్ళు థైరాయిడ్ క్యాన్సర్ సోకకముందే ఆ గ్రంధిని తొలగించుకోవాలి. జీ బాలు కిందికి దిగని వాళ్లకు వృషణాల క్యాన్సర్ ముప్పు ఎక్కువ. ఇలాంటి వాళ్లకు కిందకు జారని వృషణాన్ని తొలగించాల్సి ఉంటుంది.. ఇలా క్యాన్సర్ రాకుండా ముందస్తు సర్జరీలతో జాగ్రత్త పడవచ్చు. అలాగే కుటుంబ చరిత్రలో పెద్దపేగు, పొట్ట క్యాన్సర్లు ఉన్నవాళ్లు 20 ఏళ్ల వయసు నుంచే పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.. అండాశయ క్యాన్సర్ ముప్పు ఉన్నవాళ్లు 40 ఏళ్ల నుంచి, రొమ్ము క్యాన్సర్ ముప్పు ఉన్నవాళ్లు 25 నుంచి 30 ఏళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలి.