వెలుగులోకి మరో కొత్త వ్యాధి.. పసుపు రంగులోకి మారిన బాలుడి నాలుక?
దేశంలో వైద్య శాస్త్రం అభివృద్ధి చెందుతుండగా అదే సమయంలో కొత్తకొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన సంగతితెలిసిందే. తాజాగా కెనడాలో మరో వింత వ్యాధి బయటపడటం గమనార్హం. కెనడాకు చెందిన 12 సంవత్సరాల వయస్సు ఉన్న బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధ పడుతుండటం గమనార్హం. 12 సంవత్సరాల బాలుడు నాలుక పసుపు పచ్చగా మారడంతో […]

దేశంలో వైద్య శాస్త్రం అభివృద్ధి చెందుతుండగా అదే సమయంలో కొత్తకొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన సంగతితెలిసిందే. తాజాగా కెనడాలో మరో వింత వ్యాధి బయటపడటం గమనార్హం. కెనడాకు చెందిన 12 సంవత్సరాల వయస్సు ఉన్న బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధ పడుతుండటం గమనార్హం.
12 సంవత్సరాల బాలుడు నాలుక పసుపు పచ్చగా మారడంతో పాటు గొంతు, కడుపు నొప్పి, మూత్రంలో సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు. పరీక్షలు చేసిన వైద్యులు బాలుడు ఎప్సీన్ బార్ అనే వైరస్ బారిన పడ్డాడని గుర్తించారు. కొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత బాలుడు రక్తహీనత సమస్యతో బాధ పడుతున్నాడని తేలింది. కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధి వల్ల రోగ నిరోధక శక్తి ఎర్రరక్తకణాలపై దాడి చేసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదిక ప్రచురితమైంది. యూఎస్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ వ్యాధి వల్ల ఎర్ర రక్త కణాలు వేగంగా విచ్ఛిన్నం కావడంతో పాటు రక్తహీనత, కామెర్లు కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఏడు వారాల పాటు స్టెరాయిడ్లను వినియోగించడం వల్ల బాలుడు సాధారణ స్థితికి చేరుకున్నాడు. నాలుక రంగు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుందని ఈ నివేదిక వెల్లడించింది.
ఎర్రరక్త కణాల విచ్ఛిన్నం వల్ల శరీరంలో బైరులిబిన్ పెరిగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. అంతిమంగా పచ్చకామెర్లకు దారి తీసే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.
