Sex During Pregnancy : ఆడవారిలో అమ్మ కావాలనే కోరిక బలంగా ఉంటుంది. దీని కోసం ఎంత త్యాగానికైనా వెనుకాడదు. పురిటి నొప్పులు పునర్జన్మతో సమానమని తెలిసినా భర్తతో సంగమించేది భార్య. దీంతో ప్రసవం కోసం ఎంతో వేదన పడుతుంది. ఆ సమయంలో ఆమె ఇక జన్మలో భర్తతో కలవద్దని అనుకుంటుందట. కానీ బిడ్డ పుట్టాక అన్ని మరిచిపోయి సంతోషపడుతుంది. అందుకే ప్రతి స్త్రీ తన ప్రాణాలను పణంగా పెట్టి తల్లి కావాలని కలలు కంటుంది. దీని కోసం తన జీవితాన్ని ఎరగా పెడుతుంది. అందుకే మాతృమూర్తికి గర్భం ధరించిన నాటి నుంచి బిడ్డను కనే వరకు ఎంతో సహనంగా ఉంటుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారంలో పాల్గొన వచ్చా? పాల్గొంటే ఏమవుతుంది? ఏమైనా నష్టమా? అనే అనుమానాలు అందరిలో వస్తుంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భార్యాభర్తల మధ్య ఎడబాటు తప్పదా? అనే కోణంలో అందరు ఆలోచిస్తుంటారు. కానీ చాలా మంది ప్రెగ్నెన్సీ సమయంలో కూడా పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనవచ్చు. ఎలాంటి ప్రమాదం ఉండదు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో మీద పడుకోకుండా చూసుకోవాలి.
ప్రెగ్నెన్సీ సమయం నుంచి ఎనిమిదో నెల వరకు శృంగారంలో పాల్గొనవచ్చు. మిగిలిన రెండు నెలలు మాత్రం దూరంగా ఉంటేనే మంచిది. లేదంటే ఇబ్బందులు వస్తాయి. కొందరు గర్భవతి అని తెలియగానే కలయికకు దూరంగా ఉంటారు. మరికొందరు జీవిత భాగస్వామి అంగీకారంతో శృంగారంలో పాల్గొంటారు. ప్రెగ్నెన్సీ వల్ల శృంగార వాంఛలు కలిగించే హార్మోన్లలో కూడా తేడాలు వస్తుంటాయి. అందుకే అందరు ఆ సమయంలో శృంగారంలో పాల్గొనేందుకు ఇష్టపడరు.
తల్లి కాబోతున్నాననే భావన మహిళల్లో శృంగార కోరికలను దూరం చేస్తుంది. అయితే మగవారిలో అలాంటి భావనలు ఉండవు. భార్యకు ఎలాంటి ఇబ్బందులు లేకపోతే నిర్మొహమాటంగా శృంగారంలో పాల్గొనవచ్చు. కానీ ఆమెకు ఏదైనా అభ్యంతరం ఉంటే కచ్చితంగా ఆ పనికి దూరంగా ఉండాల్సిందే. గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలకు శృంగారం మీద పెద్దగా శ్రద్ధ ఉండదు. మగవారి ప్రోద్భలంతోనే ఆ పనికి ఒప్పుకుంటారు తప్ప ఇష్టంతో కాదు. భాగస్వామిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని కౌగిలింతలు ఇస్తే సరిపోతుందని భావిస్తుంటారు.
భర్తకు శృంగారం మీద బాగా ఇంట్రస్ట్ ఉంటే ఆమెకు ఇబ్బంది కలగకుండా శృంగారంలో పాల్గొనవచ్చు. స్పూన్ పద్ధతిలో చేసుకోవడం ఉత్తమం. స్త్రీ పురుషులు ఒకరి వెనుక ఒకరు ఉండి కాళ్లు పైకి ఎత్తి పట్టుకుని చేయడం వల్ల ఎలాంటి ముప్పు ఉండదు. ఇలా ఆమెకు కష్టం కలిగించకుండా చేయడం వల్ల ఒత్తిడి ఉండదు. దీని వల్ల ఇద్దరిలో ఎలాంటి సమస్య రాదు. ఇలా ఆమెకు కష్టం కలగకుండా చేస్తే మంచిదే. ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం చేస్తేనే ప్రసవం కూడా సులభంగా అవుతుందని చెబుతారు.