Health Tips: అన్నం తినేటప్పుడు నీళ్లు తాగొద్దా? ఎందుకు?
వేసవికాలంలో చల్లదనాన్ని ఇచ్చే పండ్లు మార్కెట్లో విరివిగా లభిస్తాయి. వీటిలో పుచ్చకాయ ఒకటి. పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఎందుకంటే పుచ్చకాయలో నీటి స్వభావం ఎక్కువగా ఉంటుంది.

Health Tips: మన శరీరం ఎక్కువ భాగం నీటితో నిండి ఉంటుంది. అయినా ఆహారం జీర్ణం కావడానికి నీరే ప్రధాన ఆధారం. అందువల్ల ఏ ఆహార పదార్థాలు తిన్నా అవి జీర్ణం కావడానికి నీటిని తీసుకుంటాం. అయితే కొందరు కొన్ని పదార్థాలు తిన్న తరువాత నీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు. అంతేకాకుండా వీటిని తిని నీరు తాగితే కొత్త రోగాలు వస్తాయంటున్నారు. మరి ఏవి తిన్నాక నీరును తాగకూడదో తెలుసుకుందామా.
సాధారణంగా అన్నం తినేటప్పుడు నీరు కూడా తాగుతుంటారు. తిన్న అన్నం జీర్ణం కావడానికి నీరు తప్పనిసరి అయితే ముద్ద దిగేందుకు కొన్ని నీళ్లు తాగాలి. కానీ ఎక్కువ మోతాదులో నీరు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. తిన్న ఆహారం త్వరగా డైజేషన్ చేయడానికి నీరు ఉపకరిస్తుంది. అటువంటప్పుడు ఆహారం మిళితమయ్యే వరకు గ్యాప్ ఇవ్వాలి. అంతకుముందే నీరు తాగడం వల్ల పిండిపదార్థం కాకముందే ఆహారం వెళ్లిపోతుంది. దీంతో ఈ ఆహారం ద్వారా రక్తం ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉండవు.
వేసవికాలంలో చల్లదనాన్ని ఇచ్చే పండ్లు మార్కెట్లో విరివిగా లభిస్తాయి. వీటిలో పుచ్చకాయ ఒకటి. పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఎందుకంటే పుచ్చకాయలో నీటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. అయితే పుచ్చకాయ తిన్న తరువాత ఎట్టి పరిస్థితుల్లో నీటిని తీసుకోవచ్చు. అలాగే దోసకాయ, నారింజ పండ్లను తీసుకున్నా ప్రమాదమే. ఇవి తిన్న తరువాత నీటిని తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. అసలు ఈ పండ్లు తిన్న తరువాత నీరు తాగితే ఏం జరుగుతుంది?
ఆహారం తీసుకున్న తరువాత అది పిండి పదార్థంలా మారడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఇలాంటప్పుడు నీళ్లు తాగడం వల్ల సరిగ్గా జీర్ణం అవదు. అసౌకర్యంగా ఉంటుంది. అందువల్ల అన్నం తిన్నాక కూడా వెంటనే నీరు తాగకుండా కాసేపు ఆగిన తర్వాత నీటిని తీసుకోవడం మంచిది అని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు.
