Pregnancy Photoshoot: ఓకే సారి తల్లి కోడలు అత్త గర్భం
Pregnancy Photoshoot: పుర్రెకో గుణం.. జిహ్వకో రుచి అంటారు. అభిరుచిలో ఒక్కొక్కరిది ఒక్కో విధంగా ఉంటుంది. మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుంది అది వేయి రకాలుగా ఉంటుంది. ఎవరి వెర్రి వారికి ఆనందం అంటారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందరిని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తోంది. ఒకరిని మించి మరొకరు తమ మెదళ్లకు పనిచెబుతున్నారు. తమ గురించి రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ తమ ప్రభావం చూపుతున్నారు. భార్య ప్రెగ్నెన్సీతో.. వృత్తిరీత్యా […]


Pregnancy Photoshoot
Pregnancy Photoshoot: పుర్రెకో గుణం.. జిహ్వకో రుచి అంటారు. అభిరుచిలో ఒక్కొక్కరిది ఒక్కో విధంగా ఉంటుంది. మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుంది అది వేయి రకాలుగా ఉంటుంది. ఎవరి వెర్రి వారికి ఆనందం అంటారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందరిని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తోంది. ఒకరిని మించి మరొకరు తమ మెదళ్లకు పనిచెబుతున్నారు. తమ గురించి రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ తమ ప్రభావం చూపుతున్నారు.
భార్య ప్రెగ్నెన్సీతో..
వృత్తిరీత్యా ఫొటో గ్రాఫర్ అయిన జిబిన్ భార్య గర్భం ధరించింది. దీంతో ఇరు కుటుబాల్లో సంతోషం కలిగింది. భార్య చింజు కోసం ప్రత్యేక ఫొటో షూట్ ఏర్పాటు చేశాడు. కానీ ఇక్కడే అతడికి ఇంకో ఆలోచన తట్టింది. తమ కుటుంబంలో ఉన్న అందరిని ప్రెగ్నెన్సీగా చూపించాలి అనుకున్నాడు. తన మదిలో మెరిసిన ఆలోచనను భార్యకు చెప్పాడు. దీంతో ఆమె కూడా అతడికి మద్దతు తెలపడంతో ఈ ప్రయత్నం చేశాడు. మూడు తరాల వారిని గర్భవతులుగా చూపించాలని ఆశపడ్డాడు. అతడి ఆలోచనకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అతడికి ఆ ఆలోచన
భార్య ప్రెగ్నెన్సీతో అతడికి వచ్చిన ఆలోచనతో తన కుటుంబంలోని అందరిని గర్భం దాల్చినట్లు చూపిస్తే ఎలా ఉంటుందని ఊహించాడు. తన ఆలోచనకు అనుగుణంగా భార్యతో పాటు అందరు గర్భం దాల్చినట్లు చూపించాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా వారి కడుపులో గర్భం ఉన్నట్లు దిండ్లు పెట్టి వారిని అలా చూపించాడు. తన కెమెరా సాయంతో వారిని గర్భవతులుగా చూపించి అతడిలోని నైపుణ్యాన్ని బయట పెట్టాడు. దీంతో ఫొటోకు నెటిజన్ల నుంచి స్పందన రావడంతో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో
భార్యతో పాటు ఆమె అమ్మ, అత్తమ్మ, అమ్మమ్మలు గర్భం దాల్చినట్లు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆ ఫొటోకు పలు కామెంట్లు, షేర్లు వచ్చాయి. ప్రేక్షకులు మురిసిపోయారు. మూడు తరాలను అలా చూపించడం అందరికి తెగ నచ్చింది. అతడి ఆలోచనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కొన్ని ఫొటోలు అందరిని ఇలా ఆకర్షించడం సహజమే. ఓ ఫొటోగ్రాఫర్ కు వచ్చిన ఆలోచన ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ప్రెగ్నెన్సీ ఫొటో అందరికి ఎంతో నచ్చింది.

Pregnancy Photoshoot
భార్య గర్భంతో..
ఫొటోగ్రాఫర్ ఆలోచన వారి కుటుంబం అంతా గర్భం దాల్చినట్లు చూపించడం. ఇది అందరికి పలు రకాల ఆలోచనలలకు దారి తీసింది. కానీ అతడి ఆలోచనకు మంచి స్పందన రావడంతో అందరు సంతోషపడుతున్నారు. తమ కుటుంబం ప్రస్తుతం వైరల్ కావడంతో వారికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇలా ఫొటో షూట్ చేయడం అతడి విభిన్నతకు నిదర్శనం. మనుషుల మెదళ్లలో వచ్చే ఆలోచనలు కొన్నిసార్లు భిన్నంగా ఉండటం గమనార్హం. మొత్తానికి ప్రస్తుతం ఈ ఫొటో అందరిలో ఆసక్తి పెంచుతోంది.