Telangana Assembly Election: కేసీఆర్ కోసం ప్రచారం.. కాంగ్రెస్ కే ఓటు.. ట్రెండింగ్ వీడియో వైరల్!
బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో చాలా వరకు వ్యతిరేకత ఉంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లలో మోసం..తో రైతులు ఈసారి కేసీఆర్‌ను గద్దె దించుతామంటున్నారు.

Telangana Assembly Election: తెలంగాణలో ఎన్నికల సమరం వేడెక్కుతోంది. ఒకవైపు అధికార బీఆర్‌ఎస్, మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ ప్రచార వేగం పెంచుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ కూడా అగ్రనేతలతో ప్రచారం చేయిస్తోంది. బీజేపీ కూడా ఇప్పటికే నాలుగు సభలు నిర్వహించింది. అయితే ఈసారి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి. చివరి వరకు ఎవరికి అధికారం వస్తుందో స్పష్టంగా చెప్పడం లేదు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చర్చకు దారితీసింది.
ప్రచారం కేసీఆర్‌కు..
బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో చాలా వరకు వ్యతిరేకత ఉంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లలో మోసం..తో రైతులు ఈసారి కేసీఆర్‌ను గద్దె దించుతామంటున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, వచ్చిన నోటిఫికేషన్ల పరీక్షల పేపర్లు లీక్ కావడం, రద్దుకావడం వంటి కారణాలతో యువత బీఆర్‌ఎస్‌కు దూరమైంది. ఉద్యోగులదీ అదే పరిస్థితి. నెలనెలా జీతాలు సక్రమంగా రాని పరిస్థితి. ఒక్క పెన్షనర్లు మాత్రమే బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నారు. కానీ, కాంగ్రెస్ గ్యాంరెంటీలు అన్నివర్గాలను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు రూ.2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులు ఆర్థికసాయం, రైతుబంధు పెంపు, ధాన్య మద్దతు ధరపై బోనస్ వంటి అంశాలు రైతులను ఆకట్టుకుంటున్నాయి. పెన్షన్లు రూ.4 వేలకు పెంపు పెన్షనర్లను ఆకర్షిస్తోంది. మహిళలకు రూ.2,500 సాయం, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీలు యువతను కూడా కాంగ్రెస్‌వైపు చూసేలా చేసింది. అయితే తెలంగాణలో ధనిక పార్టీ అయిన బీఆర్‌ఎస్ అధినేత డబ్బులతో ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సభలకు ప్రజలు రాకపోయినా డబ్బులు ఇచ్చి మరీ రప్పించుకుంటున్నారు. దీంతో కేసీఆర్‌కు ప్రచార సభలకు వస్తున్న ప్రజలు తాము ఓటు మాత్రం కాంగ్రెస్‌వే వేసాంటున్నారు.
వీడియో ఇలా..
మిర్యాలగూడకు చెందిన ఓ బీఆర్‌ఎస్ కార్యకర్త మాట్లాడిన మాటల వీడియో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రచారం కేసీఆర్‌కు చేస్తాం.. ఓటు మాత్రం కాంగ్రెస్‌కు వేస్తాంమని సదరు వ్యక్తి తెలిపాడు. పైసలు ఇస్తున్నారు కదా అంటే.. పైసలు జేబుల నుంచి ఇస్తున్నడా.. ఇన్ని రోజులు మా దగ్గర నుంచి గుంజిండు అవే మాకు ఇస్తున్నడు. పైసల్ తీసుకునుడే.. ఓటు కాంగ్రెస్‌కు వేసుడే’ అని వ్యాఖ్యానించారు. దాదాపు తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అని బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
