Sudha Kongara: తన విలక్షణ దృష్టితో అతి తక్కువ కాలంలోనే ప్రముఖ దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన వ్యక్తి సుధా కొంగర. మరోవైపు అదే రీతిలో పాత్ర ఏదైనా కథలో విభిన్నతను ఎంచుకుని ప్రేక్షకులను అలరించే హీరో సూర్య. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి తెరపై కనిపించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే వీరిద్దరూ ఆకాశమే నీ హద్దురా సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఈ చిత్రానికి బెస్ట్ యాక్టర్, డైరెక్టర్, మ్యూజిక్ కంపోసర్గా ఎన్నో అవార్డులు లభించాయి. ఈ క్రమంలోనే మరోసారి బాక్సాఫీసును బద్దలు కొట్టేందుకు సూర్య, సుధ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరి మధ్య కథకు సంబంధించిన చర్చలు ముగిసినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే మరో అద్భుతమైన కథతో సినిమా రావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జి.ఆర్ గోపినాథ్ జీవిత కథ ఆధారంగా సుధ కొంగర తెరకెక్కించిన చిత్రం సూరరై పొట్రు. తెలుగు ఈ సినిమాను ఆకాశమే నీ హద్దురా పేరుతో విడుదల చేశారు. ఆ తర్వాత ఈ చిత్రం సాధించిన ఘనత అందరికి తెలిసిందే. సుధ తెలుగులో గురు సినిమాను తెరకెక్కించారు. విక్టరీ వెకంటేశ్ హీరోగా నటించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్, బాక్సింగ్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.
మరోవైపు సూర్య జైభీమ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైలర్ రిలీజ్ అయ్యింది. అందులో సూర్య నటనకు అభిమానులు మురిసిపోతున్నారు. టీ జే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు2న ప్రేక్షకుల ముందుకు రానంది.