Site icon OkTelugu

TVS Bikes Sales Growth: 2026 ఏప్రిల్ అమ్మకాల్లో TVS జోరు.. ఈ బైక్స్ దే హవా..

TVS Bikes Sales Growth

TVS Bikes Sales Growth

TVS Bikes Sales Growth: భారతదేశంలో TVS కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. టూవీలర్స్ విక్రయాల్లో ఈ కంపెనీ ఎప్పటికీ టాప్ లెవల్లో ఉంటూ వస్తోంది. ఇందులో భాగంగా 2026 ఏప్రిల్ నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ అమ్మకాలు వృద్ధిని చూపించాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ కంపెనీ అమ్మకాలు ఈ ఏడాది 8 శాతం పెరిగాయి. అయితే, మార్చి 2026తో పోలిస్తే మాత్రం అమ్మకాలు స్వల్పంగా తగ్గుదలని నమోదు చేశాయి. ఈ అమ్మకాల గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

2026 ఏప్రిల్ లో కంపెనీ మొత్తం అమ్మకాలు 3,48,545 యూనిట్లకు చేరుకున్నాయి. గత మార్చి 2026తో పోలిస్తే 8 శాతం వృద్ధిని సాధించాయి. వీటిలో జూపిటర్, అపాచీ బైక్స్ టాప్ లెవల్లో ఉన్నాయి. టీవీఎస్ అమ్మకాల్లో జూపిటర్ అత్యధిక వాటాను (సుమారు 33.68%) కలిగి ఉండి, కంపెనీకి ‘వాల్యూమ్ కింగ్’గా నిలిచింది. ఏప్రిల్‌లో మొత్తం 1,17,383 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 14 శాతం వృద్ధి సాధించింది. ప్రతి ముగ్గురు టీవీఎస్ వినియోగదారులలో ఒకరు జూపిటర్‌ను ఎంచుకోవడం విశేషం. ఆ తరువాత టీవీఎస్ అపాచీ (Apachi)అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తూ 49,390 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది . స్పోర్టీ స్కూటర్ ఎన్ టార్క్ (Ntorq) 33,994 యూనిట్లతో 34 శాతం వృద్ధిని నమోదు చేసి, యువతలో తన ఆదరణను చాటుకుంది.

ఎలక్ట్రిక్ విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్ (iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ ఏకంగా 35 శాతం వృద్ధిని నమోదు చేసి, 37,193 యూనిట్లతో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ టూ-వీలర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. మోపెడ్ విభాగంలో సంప్రదాయ ఎక్స్‌ఎల్ (XL) మోపెడ్ 42,246 యూనిట్ల అమ్మకాలతో స్థిరమైన డిమాండ్‌ను కలిగి ఉంది ఈ నెలలో టీవీఎస్ రైడర్ (Raider) అమ్మకాలు కొంత నిరాశపరిచాయి. ఏప్రిల్ 2025తో పోలిస్తే, రైడర్ అమ్మకాలు 32 శాతం తగ్గి 29,064 యూనిట్లకే పరిమితమయ్యాయి. దీనికి ప్రధానంగా 125cc బైక్ సెగ్మెంట్‌లో పెరుగుతున్న పోటీని కారణంగా భావిస్తున్నారు. మరోవైపు, టీవీఎస్ రోనిన్ (Ronin) 64 శాతం భారీ వృద్ధితో 8,981 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి మార్కెట్‌లో జోరు చూపిస్తోంది.

మొత్తంగా చూస్తే, టీవీఎస్ తన స్కూటర్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా, కొన్ని మోటార్ సైకిల్ మోడల్స్‌లో మార్కెట్ పోటీని ఎదుర్కొంటోంది.

Exit mobile version