Mukesh Ambani: అదానీని కొట్టేయడమే టార్గెట్: ముకేశ్ అంబానీ ముందు చూపు మామూలుగా లేదుగా

Mukesh Ambani: కళ్ళు ఉన్న వాడు ముందు చూస్తాడు. దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. అంతటి దిమాక్, పొలిటికల్ లాబీయింగ్ ఉంది కాబట్టే ముకేశ్ అంబానీ దునియాను మొత్తం ఏలాలి అనుకుంటున్నాడు. అందుకే ముందు చూపుతో ఆస్తిని మూడు ముక్కలు చేశాడు. తన ముగ్గురు పిల్లలు ఈషా, ఆకాష్, అనంత్ కు పంచి ఇచ్చాడు. మొన్న జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. పైకి అందరికీ ఇది వ్యాపార విస్తరణలాగా కనిపిస్తోంది. […]

Written By: K.R, Updated On : September 3, 2022 4:44 pm
Follow us on

Mukesh Ambani: కళ్ళు ఉన్న వాడు ముందు చూస్తాడు. దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. అంతటి దిమాక్, పొలిటికల్ లాబీయింగ్ ఉంది కాబట్టే ముకేశ్ అంబానీ దునియాను మొత్తం ఏలాలి అనుకుంటున్నాడు. అందుకే ముందు చూపుతో ఆస్తిని మూడు ముక్కలు చేశాడు. తన ముగ్గురు పిల్లలు ఈషా, ఆకాష్, అనంత్ కు పంచి ఇచ్చాడు. మొన్న జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. పైకి అందరికీ ఇది వ్యాపార విస్తరణలాగా కనిపిస్తోంది. కానీ తెరవెనక జరిగింది వ్యాపార విభజన. గతంలో తన భార్యకు, ఆకాష్, ఈషాకు ఖరీదైన బహుమతులు ఇచ్చిన ముఖేష్.. ఈసారి చిన్న కొడుకు అనంత్ కు ఏకంగా ఒక భవన సముదాయాన్ని కొనిచ్చాడు. దీని విలువ 600 కోట్ల దాకా ఉంటుందట!

Mukesh Ambani

ఎందుకు ఈ ఆస్తుల పంపకం

ధీరుబాయ్ అంబానీ కన్నుమూసిన తర్వాత ఆస్తుల పంపకంలో అనిల్ కు, ముఖేష్ కు గొడవలు వచ్చాయి. అప్పట్లో పెద్ద పెద్ద కార్పొరెట్లు ఈ పంచాయితీని డీల్ చేశారు. ఈ పరిణామంతో ధీరుబాయ్ అంబానీ భార్య కోకిలా బెన్ అనారోగ్యం పాలయ్యారు. చాలా రోజుల తర్వాత కోలుకున్నారు. అయితే తమ సోదరులు లాగానే తన ముగ్గురు పిల్లలు ఆస్తుల విషయంలో గొడవలు పడుకూడదని ముకేశ్ అంబానీ ఈ నిర్ణయం తీసుకున్నారని కార్పొరేట్లు అనుకుంటున్నారు. పైగా ప్రస్తుత మార్కెట్లో గౌతం అదానీ మూడో ప్రపంచ అతిపెద్ద ధనవంతుడిగా అవతరించాడు. ముకేశ్ అంబానీ దాటేసి వ్యాపార విస్తరణకు నడు బిగిస్తున్నాడు. గ్యాస్ నుంచి మొదలుపెడితే మీడియా వరకు ప్రతి వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నాడు.

Also Read: Aus Vs Zim : ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి.. పసికూన జింబాబ్వే సరికొత్త చరిత్ర.. అసీస్ పరువు పాయే!

Mukesh Ambani

ఇదే ముఖేష్ కు కొరకరాని కొయ్య అయింది. ఎలాగైనా గౌతమ్ అదానేని దాటేయాలని ముఖేష్ తన వ్యాపారాన్ని మూడు ముక్కలు చేశాడు. తన ముగ్గురు పిల్లలకి తలా ఒకటి అప్పజెప్పాడు. కానీ చైర్మన్ గా తానే కొనసాగుతానని ప్రకటించాడు. అంటే పిల్లలు తెలిసో తెలియకో తప్పులు చేసినా వెనుక ఉండి సరి దిద్దుతాడటన్నమాట! మరోవైపు కూల్ డ్రింక్ వ్యాపారం లోకి కూడా రిలయన్స్ ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో పెప్సికో హోల్డింగ్స్ లీడింగ్ లో ఉంది. ఎప్పటినుంచో ఆ కంపెనీని దాటేసి నెంబర్ వన్ గా ఎదగాలని ముఖేష్ కు ఉంది. అందుకే కంపా అనే పేరుతో మార్కెట్లోకి కొత్త కూల్ డ్రింక్ ను తీసుకురావాలని యోచిస్తున్నాడు. ఇందుకు కోకోకోలా కంపెనీ సహకారం కూడా తీసుకుంటున్నాడు. అయితే ఇప్పటికే వాళ్లు రాష్ట్రాల్లో ఉన్న కోకో కోలా యూనిట్లను లీజుకు తీసుకోవాలని మొన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రపోజల్ పెట్టగా రిలయన్స్ డైరెక్టర్లందరూ ఓకే చెప్పినట్టు సమాచారం. మోడీకి సన్నిహితుడుగా ఆస్ట్రేలియా నుంచి శ్రీలంక దాకా వ్యాపారాలు చేస్తున్న అదానీని ముఖేష్ ఏ విధంగా నిలువరించగలడోనని కార్పొరేట్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది.

Also Read:Dil Raju- Jalsa Movie: జల్సా సినిమా స్పెషల్ షోస్ పై నిర్మాత దిల్ రాజు ఫైర్!

 

Tags