Site icon OkTelugu

Tecno Pova 8 49 Animations: ఈ ఫోన్ వెనకాల 49 రకాల యానిమేషన్లు.. ఏ కంపెనీది.. ధర ఎంత..

Tecno Pova 8 49 Animations

Tecno Pova 8 49 Animations

Tecno Pova 8 49 Animations: కొత్త మొబైల్ కొనాలని అనుకునేవారికి Tecno Pova కంపెనీ గుడ్ న్యూస్ తెలపింది. లేటేస్ట్ గా Tecno Pova 8 స్మార్ట్‌ఫోన్ ఇటీవలే (జూన్ 11, 2026) భారత మార్కెట్‌లో విడుదలైంది. అద్భుతమైన డిస్ ప్లే, బలమైన బ్యాటరీ కావాలని అనుకునేవారికి ఈ ఫోన్ స్పెషల్ గా ఉంటుంది. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

Tecno Pova 8 ఒక విభిన్నమైన మరియు ఆకర్షణీయమైన గేమింగ్ డిజైన్‌తో వస్తుంది. దీని వెనుక భాగంలో ‘ఎలైవ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే’ అనే ప్రత్యేకమైన లైట్ ప్యానెల్ ఉంటుంది. ఇది కాల్స్, నోటిఫికేషన్లు మరియు ఛార్జింగ్ సమయంలో దాదాపు 49 రకాల యానిమేషన్లను ప్రదర్శిస్తుంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.76-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ప్యానెల్ ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది.దీనివల్ల గేమింగ్ మరియు స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. ఇది 950 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ బలమైన బ్యాటరీ. ఇందులో 8,000mAh బ్యాటరీని చేర్చారు. సాధారణంగా ఇతర స్మార్ట్‌ఫోన్ల కంటే ఇది చాలా ఎక్కువ బ్యాకప్ ఇస్తుంది. కంపెనీ క్లెయిమ్ ప్రకారం..ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు రెండు రోజుల వరకు వాడుకోవచ్చు. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది బ్యాటరీని నిర్ణీత సమయంలో ఛార్జ్ చేయడానికి సహాయపడుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం ఇది 8GB వరకు ర్యామ్ , 256GB వరకు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అలాగే, కనెక్టివిటీ కోసం ఇందులో ప్రత్యేకమైన G1 మరియు SE1 సిగ్నల్ చిప్‌సెట్‌లను అమర్చారు. ఇవి బలహీనమైన సిగ్నల్ ఉన్న చోట కూడా నెట్‌వర్క్ స్థిరంగా ఉండేలా చూస్తాయి. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 పై రన్ అవుతుంది.

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సోనీ LYT-600 సెన్సార్‌తో కూడిన కెమెరా ఉంది. ఇది తక్కువ కాంతిలో కూడా మంచి క్లారిటీని అందిస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. అలాగే, ఇది IP64 డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉండి, MIL-STD-810H సర్టిఫికేషన్‌తో దృఢంగా ఉంటుంది.

భారతదేశంలో Tecno Pova 8 ధర 6GB+128GB వేరియంట్ రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB+128GB వేరియంట్ ధర రూ.31,999 వరకు ఉంది. ఈ ఫోన్ జూన్ 18, 2026 నుంచి ఫ్లిప్‌కార్ట్ ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Exit mobile version