Site icon OkTelugu

Motorola Edge 70 Pro Review: Motorola Edge 70 Pro రివ్యూ.. ఇది ఎవరికి బాగా అవసరం..

Motorola Edge 70 Pro Review

Motorola Edge 70 Pro Review

Motorola Edge 70 Pro Review: ప్రముఖ మొబైల్ కంపెనీ Motorola తన ‘ఎడ్జ్’ సిరీస్‌లో భాగంగా ఇటీవల Motorola Edge 70 Pro తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మొబైల్ ప్రీమియం డిజైన్ తో పాటు శక్తివంతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీని గురించి పూర్తి వివరాల్లో కి వెళితె..

Motorola Edge 70 Pro స్మార్ట్‌ఫోన్ అత్యంత సన్నగా 6.99mm మందంతో ఆకర్షణీయమైన క్వాడ్-కర్వ్డ్ డిజైన్‌తో తయారు చేశారు. ఇది కేవలం 190 గ్రాముల బరువు కలిగి ఉండి, చేతిలో పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో 6.78-అంగుళాల ‘ఎక్స్‌ట్రీమ్’ AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తూ.. 1.5K రిజల్యూషన్ ను అందిస్తుంది. అలాగే 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పనిచేయడం వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, ఇది IP68 లేదా IP69 రేటింగ్ ఉండడంతో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ నుంచి రక్షణ పొందవచ్చు.

ఈ ఫోన్ శక్తివంతమైన ‘మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్’ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీంతో వేగంగా పనులు చేసేవారికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మల్టీ టాస్కింగ్ కోసం ఇందులో 12GB వరకు LPDDR5X RAM సెటప్ చేశారు. అలాగే స్టోరేజ్ కోసం 256GB నుంచి 512GB UFS 4.1 ఆప్షన్లు ఉన్నాయి. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీనివల్ల సాఫ్ట్‌వేర్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది.

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ చేశారు. ఇందులో 50MP సోనీ LYTIA 710 మెయిన్ సెన్సార్ (OISతో), 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 3.5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం ఉన్న 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో కూడా 50MP కెమెరాను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ 6,500mAh సామర్థ్యం గల భారీ సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది సాధారణ వాడకంతో రోజంతా సులభంగా వస్తుంది. ఈ బ్యాటరీ 90W టర్బోపవర్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. అదనంగా, ఇది 15W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది.

భారత మార్కెట్లో మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ధర వేరియంట్‌ను బట్టి సుమారు రూ. 38,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB/256GB వేరియంట్ ₹38,999 ఉండగా, 12GB/256GB వేరియంట్ ధర సుమారు ₹41,999గా ఉంది. ప్రీమియం లుక్, మంచి డిస్‌ప్లే, మరియు సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపికగా నిలుస్తుంది. స్లిమ్ డిజైన్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్ మరియు స్మూత్ డిస్‌ప్లే కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక.

Exit mobile version