https://oktelugu.com/

2024 Maruti Swift: మోడ్రన్‌ లుక్స్‌తో మారుతి స్విఫ్ట్‌.. అదిరిపోయే ఫీచర్లు ఇవీ

ఈ అప్‌కమింగ్‌ స్విఫ్ట్‌ కారులో పలు ఎక్స్‌టీయిర్, ఇంటీరియర్‌ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మోడ్రన్‌ లుక్స్‌తో అతి త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకు వస్తుందని సమాచారం.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 15, 2024 / 07:05 PM IST

    2024 Maruti Suzuki Swift

    Follow us on

    2024 Maruti Swift: దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతి సుజుకి త్వరలో నెక్ట్స్‌ జెన్‌ స్విఫ్ట్‌ కారును లాంచ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతానికి ఈ కారును YED అనే కోడ్‌ నేమ్‌తో పిలుస్తున్నారు. ఈ అప్‌కమింగ్‌ స్విఫ్ట్‌ కారులో పలు ఎక్స్‌టీయిర్, ఇంటీరియర్‌ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మోడ్రన్‌ లుక్స్‌తో అతి త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకు వస్తుందని సమాచారం.

    కొత్త ఫీచర్లు ఇవే..
    – ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, టెయిల్‌ టైల్స్‌
    – ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌
    – 16 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌
    – ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌
    – ఎలక్ట్రికల్లీ అజ్జెస్టబుల్‌ అండ్‌ పోర్టబుల్‌ వింగ్‌ మిర్రర్స్‌
    – ఆటో హెడ్‌ల్యాంప్స్‌
    – 9 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్‌ సిస్టమ్‌
    – వైర్‌లెస్‌ యాపిల్‌ కార్‌ప్లే
    – ఆండ్రాయిడ్‌ ఆటో

    సేఫ్టీ ఫీచర్లు..
    – 6 ఎయిర్‌ బ్యాగ్స్‌
    – టైర్‌ ప్రెజర్‌ మోనిటర్‌
    – ఏబీఎస్‌ విత్‌ ఈబీడీ
    – బ్రేక్‌ అసిస్ట్‌
    – ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌
    – హిల్‌ హోల్ట్‌ కంట్రోల్‌

    ఏడీఏఎస్‌ ఫీచర్లు..
    – లేన్‌ కీపింగ్‌ అసిస్ట్‌
    – బ్లైండ్‌ స్పాట్‌ మానిటర్‌
    – అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌
    – లేన్‌ డిపార్చర్‌ వార్నింగ్‌ అండ్‌ ప్రివెన్షన్‌

    మోడ్రన్‌ లుక్‌లో..
    మారుతి సుజికి కంపెనీ ఇప్పటికే జపాన్, యూరోప్‌లో ఈ నెక్స్‌ జెన్‌ స్విఫ్ట్‌ కారును విడుదల చేసింది. దీనిని బంటి ఇండియన్‌ స్పెక్‌ మోడల్‌ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. విదేశాల్లో విడుదల చేసిన మారుతి సుజుకీ స్విఫ్ట్‌ కారును చూస్తే డిజైన్‌లో విప్లవాత్మకమైన మార్పులు ఏమీ చేయలేదని తెలుస్తుంది. డిజైన్‌ ఫిలాసఫీలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ, మోడ్రన్‌ లుక్‌ వచ్చేలా తీర్చిదిద్దారు.

    కొద్ది నెలల్లోనే మార్కెట్‌లోకి..
    ఈ మారుతి సుజుకి కంపెనీ కొత్త తరం స్విఫ్ట్‌ కానును మరి కొద్ది నెలల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మోడల్‌లో పాత మోడల్‌ కన్నా 15 ఎంఎం పొడవు, 40 ఎంఎం ఇరుకుగా, 30 ఎంఎం ఎత్తుగా ఉంటుంది. దీని వీల్‌ బేస్‌ మాత్రం 2450 ఎంఎంగానే ఉంది. దీని లాంచ్‌ డేట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మోడల్‌ విడుదలైతే హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10 నియోస్, టాటా టియాగోలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

    ధర ఇలా..
    ప్రస్తుతం మారుతి స్విఫ్ట్‌ కారు దర సుమారు రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షలు(ఎక్స్‌ షోరూం)గా ఉంది. అయితే అప్‌కమింగ్‌ హ్యాచ్‌బ్యాక్‌ ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.