Site icon OkTelugu

LIC Money Back Plan: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. రూ.125 పొదుపుతో రూ.25 లక్షలు?

LIC Money Back Plan: LIC New Children Money Back PlanLIC Money Back Plan: దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీలలో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదిరిపోయే తీపికబురు అందించింది. ఎల్‌ఐసీ అందిస్తున్న పాలసీలలో మనీ బ్యాక్ పాలసీలు కూడా ఉండగా ఈ పాలసీలలో పిల్లల భవిష్యత్ కొరకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎల్‌ఐసీ పాలసీల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు మెచ్యూరిటీ తర్వాత భారీ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.

న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ పేరుతో ఎల్‌ఐసీ ఈ పాలసీని అందిస్తుండటం గమనార్హం. పిల్లల వయస్సును బట్టి పాలసీ టర్మ్ మారే అవకాశాలు అయితే ఉంటాయి. సాధారణంగా పాలసీ టర్మ్ 25 సంవత్సరాలు కాగా సంవత్సరం వయస్సు ఉన్న పిల్లల పేర్లపై కూడా ఈ పాలసీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లల పేర్లపై పాలసీ తీసుకుంటే పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు అవుతోంది.

పిల్లల పుట్టిన సంవత్సరానికే పాలసీని తీసుకుంటే పాలసీ టర్మ్ 24 సంవత్సరాలు కాగా రోజుకు 125 రూపాయల చొప్పున నెలకు 3700 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత రూ.2 లక్షలు, 20 సంవత్సరాల వయస్సులో 2 లక్షలు, 22 సంవత్సరాల వయస్సులో 2 లక్షలు, 25 సంవత్సరాల తర్వాత 19 లక్షల రూపాయలు లభిస్తాయి. కేవలం 12 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే ఈ పాలసీని తీసుకోవచ్చు.

సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పిల్లల పేర్లపై పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు.

Exit mobile version