Site icon OkTelugu

Lenovo Legion Y960 Headset: గేమ్ ఆడేవారి కోసం Lenovo నుంచి కొత్త డివైజ్..

Lenovo Legion Y960 Headset

Lenovo Legion Y960 Headset

Lenovo Legion Y960 Headset: ఎలక్ట్రానిక్ విభాగంలో Lenovo కంపెనీ తనదైన ముద్ర వేసుకుంది. వినియోగదారులను ఆకర్షించేందుకు విభిన్న రీతిలో డివైజ్ లను తీసుకువస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా గేమర్స్ కోసం ‘లీజియన్’ (Legion)అనే హెడ్‌సెట్‌ను తాజాగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. మంచి సౌండింగ్ లో ఉండే ఈ డివైజ్ తో మంచి అనభూతిని పొందుతారు. దీని ధర, ఇతర వివరాల్లోకి వెళితె..

Lenovo నుంచి Legion Y960 అనే హెడ్‌సెట్ ఇటీవల చైనాలో విడుదలైంది. దీని ధర సుమారు 599 చైనీస్ యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.7,100). ఇది బ్లాక్ మరియు సిల్వర్ రంగులలో లభిస్తుంది. గేమింగ్ ఆడేవారికి ఇది బాగా యూజ్ ఫుల్ గా ఉంటుంది. ఇది అత్యాధునిక ఆడియో అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.

ఈ హెడ్‌సెట్ లో ప్రధాన ఆకర్షణ ఇందులో ఉండే ‘ఫిజికల్ 7.1 ఛానెల్ సరౌండ్ సౌండ్’ సిస్టమ్. ఇందులో ప్రతి ఇయర్‌కప్‌లో రెండు 40mm డ్రైవర్లు, నాలుగు 20mm డ్రైవర్లు కలిపి మొత్తం ఆరు డ్రైవర్ల సెటప్‌ను ఉపయోగించారు. దీనివల్ల గేమ్ ఆడుతున్నప్పుడు శబ్దాలు ఏ దిశ నుంచి వస్తున్నాయో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా షూటింగ్ గేమ్స్‌లో శత్రువుల అడుగుజాడలు, కాల్పుల శబ్దాలను కచ్చితంగా గుర్తించవచ్చు.

ఈ హెడ్‌సెట్ ‘హై-రెస్ ఆడియో’ (Hi-Res Audio) సర్టిఫికేషన్ పొందింది. 20Hz నుంచి 40kHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్‌తో, టైటానియం కోటెడ్ డయాఫ్రమ్స్ అమర్చడం వల్ల ఆడియో చాలా స్పష్టంగా ఉంటుంది. అలాగే, ‘సౌండ్ ప్రింట్ పర్స్‌పెక్టివ్’ అనే ఫీచర్ గేమింగ్‌లో అవసరమైన సౌండ్స్ న హైలైట్ చేస్తుంది. దీనికి ఉన్న ఇన్‌లైన్ కంట్రోలర్ ద్వారా సాఫ్ట్‌వేర్ అవసరం లేకుండానే గేమ్, మ్యూజిక్, మరియు సినిమా మోడ్స్‌ను మార్చుకోవచ్చు.

వాయిస్ చాట్ కోసం ఇందులో ఏఐ (AI) నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉన్న డిటాచబుల్ మైక్రోఫోన్ ఉంది. ఇది అనవసరపు శబ్దాలను తొలగించి, మీ వాయిస్‌ను అవతలి వారికి స్పష్టంగా వినిపిస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇది వైర్డ్ హెడ్‌సెట్. యూఎస్‌బీ టైప్-సీ మరియు టైప్-ఏ కనెక్టివిటీతో పిసి (PC), కన్సోల్స్, గేమింగ్ డివైజ్‌లకు సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే, దీనికి 16 మిలియన్ రంగులతో కూడిన ఆకర్షణీయమైన ఆర్జీబీ (RGB) లైటింగ్ ఉంది. ఈ హెడ్‌సెట్ గేమర్లకు, ప్రొఫెషనల్ స్థాయి ఆడియో అనుభవాన్ని అందించేందుకు రూపొందించారు.

Exit mobile version