Site icon OkTelugu

Gold Price Today : బంగారం ధరల్లో భారీ మార్పులు.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

gold-price-bangaram-dhara

gold-price-bangaram-dhara

Gold Price Today : కొన్నిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. మరోసారి భారీ షాక్ ఇచ్చాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు రూ.500 పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో దేశీయంగా ధరల్లో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ పెరిగి ఔన్స్ కు 2035 డాలర్లు కొనసాగింది. అలాగే సిల్వర్ 23.211 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 31న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,270 గా ఉంది. జనవరి 30న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800తో విక్రయించారు.మంగళవారం కంటే బుధవారం బంగారం ధరలు రూ.200 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,420గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.63,250 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,930తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,000 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,270తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,000తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,270తో విక్రయిస్తున్నారు.

బంగారంతో పాటు వెండి ధరలు పెరిగాయి. బుధవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76,500గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం వెండి ధరలు రూ.300 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,500గా ఉంది. ముంబైలో రూ.76,500, చెన్నైలో రూ.78,000, బెంగుళూరులో 74,000, హైదరాబాద్ లో రూ.78,000తో విక్రయిస్తున్నారు.

Exit mobile version