Flipkart: దసరా, దీపావళి పండుగ సీజన్ రావడంతో చాలామంది ఈకామర్స్ వెబ్ సైట్ల ద్వారా ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఇంటికి అవసరమైన ఇతర వస్తువులను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ప్రముఖ ఈకామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ పండుగ సమయంలో షాపింగ్ చేయాలని భావించే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ‘ఫ్లిప్‌కార్ట్ పే లేటర్’ ఆఫర్ ద్వారా 70,000 రూపాయల వరకు షాపింగ్ చేసే అవకాశం ఇస్తోంది.
రూపాయి కూడా చెల్లించకుండా ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఆ తర్వాత సులభ వాయిదాల ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించవచ్చు. గతంలో ఈ ఆఫర్ పై కేవలం 10,000 రూపాయల వరకు మాత్రమే గరిష్టంగా పొందే అవకాశం ఉండేది. కానీ ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం ఆ మొత్తాన్ని భారీగా పెంచడం గమనార్హం. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో అక్టోబర్ మొదటి వారంలో ఈ సేల్ ను నిర్వహించనుంది.
ఫ్లిప్ కార్ట్ క్రెడిట్ లిమిట్‌ను ఏకంగా 7 రెట్లు పెంచడంతో యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పది కోట్ల మందికి పైగా ఫ్లిప్ కార్ట్ కస్టమర్లు ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఆఫర్ ద్వారా క్రెడిట్ లిమిట్ పొందాలంటే పాన్ నంబర్, ఆధార్ నంబర్ లతో పాటు వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ వివరాలను వెల్లడించాలి.
ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ యాక్టివేట్ ఆప్షన్ ను ఎంచుకున్న కస్టమర్లు కార్ట్ లో ఎంపిక చేసుకున్న ప్రాడక్ట్ లకు పేమెంట్ సెక్షన్ లో ఈ.ఎం.ఐ ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈఎంఐ ఎంత మొత్తం చెల్లించాలనే వివరాలను చెక్ చేసుకుని ప్రతి నెలా ఖాతా నుంచి నగదు డెబిట్ అయ్యేలా చేయవచ్చు. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ల వల్ల ఫ్లిప్ కార్ట్ యూజర్లకు ప్రయోజనం చేకూరుతుంది.