
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్ లలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా స్కీమ్ కూడా ఒకటి కాగా సీఎం జగన్ అర్హులైన మత్య్సకారుల ఖాతాలో ఈ నెల 18వ తేదీన 10వేల రూపాయలు జమ చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 1.32 లక్షల మందికి జగన్ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
ప్రభుత్వం జమ చేసే నగదు మత్స్యకారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ముద్రాల్లో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలం కాబట్టి వేటను నిషేధిస్తారు. ఈ సమయంలో ఉపాధి లేకపోవడం వల్ల మత్స్యకారులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల జగన్ సర్కార్ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా స్కీమ్ తో మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
కరోనా వల్ల మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేయడం వల్ల మత్స్యకారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. జగన్ సర్కార్ మే నెల 13వ తేదీన వైఎస్సార్ రైతు భరోసా స్కీమ్ ను కూడా అమలు చేయనుంది. ఈ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఏకంగా 5,500 రూపాయలు జమ చేస్తుంది. ఈ డబ్బులతో పాటు కేంద్రం 8వ విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
మరికొన్ని రోజుల్లో ఈ నగదు కూడా రైతుల ఖాతాలలో జమ కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా స్కీమ్ లను అమలు చేస్తూ ఉండటంతో రైతులకు మేలు జరగనుంది.