https://oktelugu.com/

Hyundai Exeter Micro SUV: అప్డేట్ ఫీచర్లతో రూ.6 లక్షలకు వచ్చే కారు ఏదో తెలుసా?

మొన్నటి వరకు హ్యాచ్ బ్యాక్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. కానీ సేమ్ ఇంపాక్ట్ తో ఎస్ యూవీ ఫీచర్లను కలిగిన ఈ మోడల్ ను కొనడం బెటర్ అని అంటున్నారు. హ్యాుండాయ్ ఫీచర్స్ విషయానికొస్తే ఇందులో సేప్టీ కాస్త ఎక్కువే. ఇందులో రక్షణ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ ను ఉంచారు. టైర్ ఫ్రెషర్, ఓడోమీటర్ రీడింగ్, టిస్టెన్స్ టు ఎంప్టీ వంటివి సౌకర్యవంతంగా ఉన్నాయి. అలాగే వాయిస్ కమాండ్ ఆధారగా సన్ రూప్, టెంపరేషర్ పనిచేస్తాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : June 28, 2023 / 03:30 PM IST

    Hyundai Exeter Micro SUV

    Follow us on

    Hyundai Exeter Micro SUV: కారు కొనాలనుకునే వారు ఎక్కువ శాతం మంది వినియోగదారులు SUVల వైపే చూస్తారు. స్పేస్ ఎక్కువగా ఉండడంతో పాటు సీటింగ్ సౌకర్యం.. బలమైన ఇంజన్ ఎస్ యూవీల సొంతం. అయితే ధర విషయానికొస్తే కాస్త కాస్ట్లీగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో మైక్రో ఎస్ యూవీలతో తయారు కాబడిన కొన్ని మోడళ్లు మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే మారుతి నుంచి స్విప్ట్.. హ్యుండాయ్ గ్రాండ్ 10 మోడళ్లు వినియోగదారులను ఇంప్రెస్ చేశారు. వీటి ధరలు వరుసగా రూ.7 లక్షలు, రూ.9 లక్షలతో విక్రయిస్తున్నారు. కానీ ఇదే మోడల్ లో లేటేస్ట్ ఫీచర్ ను కలిగిన మరో మోడల్ మార్కెట్లోకి వచ్చింది. అయితే దీనిని కేవలం రూ. 6 లక్షలకే దక్కించుకోవచ్చు. ఇంతకీ ఆ మోడల్ ఏంటంటే?

    హ్యుండాయ్ కంపెనీ నుంచి మైక్రో ఎస్ యూవీ మోడల్ లో గ్రాండ్ ఐ 10 ఆకట్టుకుంది. అయితే కాస్త ధరను తగ్గించి లేటేస్టుగా హ్యుండాయ్ ఎక్స్ టర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఈ మోడల్ గురించి ఇప్పటికే ఆన్ లైన్లో పెట్టారు. దీంతో దీనిని దక్కించుకోవడానికి చాలా మంది బుకింగ్ చేసుకుంటున్నారు. రోజరోజుకు మైక్రో ఎస్ యూవీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.

    మొన్నటి వరకు హ్యాచ్ బ్యాక్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. కానీ సేమ్ ఇంపాక్ట్ తో ఎస్ యూవీ ఫీచర్లను కలిగిన ఈ మోడల్ ను కొనడం బెటర్ అని అంటున్నారు. హ్యాుండాయ్ ఫీచర్స్ విషయానికొస్తే ఇందులో సేప్టీ కాస్త ఎక్కువే. ఇందులో రక్షణ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ ను ఉంచారు. టైర్ ఫ్రెషర్, ఓడోమీటర్ రీడింగ్, టిస్టెన్స్ టు ఎంప్టీ వంటివి సౌకర్యవంతంగా ఉన్నాయి. అలాగే వాయిస్ కమాండ్ ఆధారగా సన్ రూప్, టెంపరేషర్ పనిచేస్తాయి.

    దక్షిణ కొరియాకు చెందిన హ్యుండాయ్ ఎక్స్ టర్ లో మొత్తంగా 40కి పైగా సేప్టీ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. భారత్ మార్కెట్లో జూలై 10న రిలీజ్ చేయనున్నారు. SUVలల్లో తొలిసారి స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ విత్ వాయిస్ కమాండ్స్ కెమెరాలు Exeter లో కనిపిస్తాయి. చిన్న కార్లలో డీజిల్ ఇంజన్లకు డిమాండ్ లేదు. అందుకే Exeter పెట్రోల్ ఇంజిన్ మాత్రమే అమర్చారు. కానీ నేరురల్సీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను ఇక్కడ ఉపయోగించే అవకాశం ఉంది. ఇక దీని ధర రూ.6 లక్షలు మాత్రమే.