Burrapadavutade Full Song: సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ‘హీరో’ మూవీతో పరిచయం అవుతున్నాడు. ఈ మూవీలో అశోక్ కు జోడీగా బ్యూటీఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘హీరో’ మూవీని అమర రాజ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో గల్లా పద్మావతి నిర్మించారు.

Hero Trailer
జనవరి 15న సంక్రాంతి కానుకగా ‘హీరో’ విడుదల అవుతుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కొద్దిరోజులుగా ‘హీరో’ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ను మూవీ మేకర్స్ భారీగా చేపడుతున్నారు. ఈక్రమంలోనే నేడు ఈ మూవీ నుంచి ‘బుర్ర పాడవుతాదే’ అనే పుల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ పాటకు భాస్కర్ భట్ల సాహిత్యం అందించగా గిబ్రాన్ సంగీతం అందించారు. రోమాంటిక్ అండ్ ఫుల్ ఎంటటైన్మెంట్ గా ఉన్న పాట అభిమానులను అలరిస్తోంది. మూడు నిమిషాల 49సెకన్ల నిడివితో విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ మూవీలో జగతిపతి బాబు, నరేష్, వెన్నల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఆశీస్సులు గల్లా అశోక్ కు మొండుగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాను తాను చూశానని, తనకు ఎంతో బాగా నచ్చిందని మహేష్ బాబు చెప్పారు. తన ఫ్యాన్స్ సపోర్టు అశోక్ కు ఉంటుందని తాజాగా ట్వీటర్లో వెల్లడించారు. దీంతో ఈ మూవీ థియేటర్లలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.