Allu arjun: స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తనతో పోటీగా వచ్చే యంగ్ టాలెంట్ హీరోలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. వాళ్లను ఆదరిస్తుంటారు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే ఇటీవలె కాలంలో చాలా మంది వర్క్‌ను గుర్తించి విషెష్ తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి.
అదే విధంగా తాజాగా, మరో యంగ్ టాలెంట్‌కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు బన్నీ. మాస్ హీరో విశ్వక్ సేన్ హీరోగా ప్రకటించిన గామి సినిమా టైటిల్ గ్లింప్పై బన్నీ స్పందించారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందంటూ.. చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ విధమైన కొత్త దర్శకులు టాలీవుడ్లోకి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
కాగా, ఈ నగరానికి ఏమైంది చిత్రంతో మంచి ఫేమ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్. ఆ తర్వాత ఫలక్నామదాస్ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. తాజాగా పాగల్ చిత్రం కూడా ప్రేక్షకులను అలరించింది. మరోవైపు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో కూడా ఓ సినిమాకు ఓప్పందం కుదుర్చుకున్నారు. ఇలా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు విశ్వక్. ఇక బన్నీ తన కెరీర్లో ఎప్పుడూ చేయని విభిన్న పాత్రతో పుష్ప సినిమాలో కనిపించేందుకు సిద్ధమయ్యారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా తొలి భాగం దాదాపు పూర్తి కావస్తోంది. రష్మిక మండనా హీరోయిన్ కాగా.. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.