Jasprit Bumrah: రికార్డులు ఏ ఒక్కరి సొత్తు కాదు. ఒకరు సాధించిన రికార్డును మరొకరు అధిగమిస్తారు. అది క్రికెట్లో అయితే రికార్డుల పరంపర కొనసాగించాల్సిందే. ఒకో మ్యాచులో ఒకో రికార్డు తిరగరాస్తుంటారు. ఒకరు నెలకొల్పిన రికార్డు మరొకరు బద్దలు కొట్టడం మామూలే. ఆటల్లో అయితే ఇది చాలా తేలికే. ఒకోసారి ఒకరి పేరు మీద ఉన్న రికార్డు వారే చెరిపేయడం కూడా చూస్తుంటాం. ఇదే కోవలో రికార్డులు నెలకొల్పడం కొత్తేమీ కాదు. ప్రతి ఆటలో ఎవరో ఒకరు తమ సత్తా చాటుతూ రికార్డులు సాధిస్తుంటారు.

Jasprit Bumrah
ఈ నేపథ్యంలో టీమిండియా బౌలర్ బుమ్రా ఓ అరుదైన రికార్డు సాధించాడు. తన ఆటతో ప్రత్యర్థులను మెప్పిస్తుంటారు. పదునైన బౌలింగే కాదు పటిష్టమైన బ్యాటింగ్ కూడా అతడి సొంతం. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. తన బౌలింగ్ తో ఎప్పుడు జట్టుకు విజయాలు అందించే బుమ్రా ఈసారి మాత్రం బ్యాటింగ్ తో రాణించడం గమనార్హం. దీంతో అందరు ఫిదా అవుతున్నారు. బౌలర్ బ్యాటింగ్ లో మెరుపు మెరిపించడం ఏమిటని అనుకుంటున్నారా? ఇది నిజమే. అతడి విన్యాసానికి ఇంగ్లండ్ వేదికైంది.
Also Read: RRR New Poster Viral: ఆర్ఆర్ఆర్ కొత్త పోస్టర్ వైరల్.. ఎన్టీఆర్ – చరణ్ మధ్యలో రాజమౌళి
గతంలో వెస్టిండీస్ ఆటగాడు బ్రియాన్ లారా ఒక ఓవర్ లో 28 పరుగులు రాబట్టాడు. కానీ ప్రస్తుతం బుమ్రా ఒకే ఓవర్ లో ఏకంగా 35 పరుగులు రాబట్టుకుని లారా రికార్డను బద్దలు కొట్టాడు. లారా బ్యాట్స్ మెన్ కాగా బుమ్రా బౌలర్ కావడం గమనార్హం. పద్దెనిమిదేళ్ల క్రితం బ్రియాన్ లారా నెలకొల్పిన రికార్డును రెండుసార్లు అతడే బద్దలు కొట్టాడు. కానీ బుమ్రా మాత్రం లారా రికార్డును అధిగమించడం సంచలనం కలిగించింది. దీంతో ఒక బౌలర్ బ్యాట్స్ మెన్ స్థాపించిన రికార్డును తిరగరాయడం సంచలనమే.

Jasprit Bumrah
టెస్ట్ మ్యాచులో ఇన్ని పరుగులు రాబట్టుకోవడం ఇప్పటివరకు జరగలేదు. ఇంగ్లండ్ తరఫున జేమ్స్ అండర్సన్ కూడా ఓ ఘనత సాధించాడు. 60 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం కూడా సంచలనంగానే చెప్పుకోవచ్చు. ఒక బౌలర్ బ్యాట్స్ మెన్ లా మెరుపు వేగంతో పరుగులు రాబట్టి అందరిలో కంగారు పుట్టించాడు. మొత్తానికి ఇంగ్లండ్ పర్యటనలో బుమ్రా అరుదైన రికార్డు సాధించడం కొసమెరుపు. ఈ మ్యాచులో బుమ్రా తీసిన పరుగులకు అందరు ఫిదా అయిపోయారు.
Also Read:Sammathame 9 Days Collections: ‘సమ్మతమే’ పరిస్థితి అ’సమ్మతమే’.. ఎంత నష్టం అంటే ?