Chicken: మనకు ఆఫర్లంటే మహాసరదా. ఏదైనా పండుగలకు ఆఫర్లు పెట్టారంటే క్యూలో నిలబడి మరీ కొంటాం. దాన్ని సొంతం చేసుకునే వరకు నిద్ర పట్టదు. ఇలా ఉచిత ఆఫర్ల కోసం ఎన్నో ప్రయాసలు పడుతుంటాం. ఆదివారం వచ్చిందంటే చాలు అందరు మాంసం కోసం తాపత్రయపడుతుంటారు. ఎలాగైనా సరే చికెన్, మటన్, చేపలు ఏదైనా సరే ఓ ఐటమ్ ఉండాల్సిందే. లేకపోతే ముద్ద దిగదు. అలా మనవారు మాంసానికి బాగా అలవాటు పడ్డారు. ముక్క లేనిదే ముద్ద దిగని వారు చాలా మంది ఉన్నారు. మాంసాహారమంటే అందరికి జిహ్వ చాపల్యమే. దీంతో ఎడాపెడా తినేందుకు ఇష్టపడుతుంటారు. అది కూడా ఆఫర్ లో వస్తే ఇక అడ్డేముంది. లగెత్తుకెళ్లడమే. క్యూలో నిలబడి ఆఫర్ దక్కించుకోవడమే.

Chicken
కిలో చికెన్ రూ.99కే..
మీరు విన్నది నిజమే. కిలో చికెన్ ధర రూ.99లే. దీంతో అందరు ఎగబడుతున్నారు. మాంసాహారం తినేందుకు వరుస కడుతున్నారు. కొద్ది రోజులుగా మాంసాహారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులు మాంసాహారమంటేనే జంకుతున్నారు. కిలో చికెన్ రూ.250, మటన్ అయితే రూ. 800 పైనే పలుకుతోంది. చేపలు అయితే రూ.400 లు ఉండటంతో మధ్యతరగతి కుటుంబీకులు పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కిలో రూ.99 ఆఫర్ అందరిని ఆకర్షిస్తోంది.
ఇంతకీ ఎక్కడ?
కిలో రూ.99 చికెన్ ఆఫర్ నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలో ఓ చికెన్ దుకాణ నిర్వాహకుడు పెట్టిన ఆఫర్. దీంతో అందరు ఎగబడుతున్నారు. చికెన్ కొనేందుకు ఇష్టపడుతున్నారు. అతడికి మూడు పౌల్ట్రీ ఫామ్ లు ఉండటంతో వాటి వ్యాపార నిర్వహణ అతడే స్వయంగా చూసుకుంటున్నాడు. ఇతరులకు అమ్మే బదులు తానే ఆఫర్ పెట్టి మరీ అమ్ముతున్నాడు. మాంసాహార ప్రియులు చికెన్ కొనేందుకు క్యూ లో నిలబడి మరీ కొంటున్నారు. దీంతో షాపు యజమాని పంట పండినట్లు అవుతోంది.

Chicken
చుట్టు పక్కల గ్రామాల నుంచి..
ఇతర దుకాణాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ ధరకే లభిస్తుండటంతో జనం తరలి వస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా భారీ సంఖ్యలో వస్తూ చికెన్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో చికెన్ కోసం గంటల తరబడి లైన్లో నిలబడి మరీ కొంటున్నారు. అతడు పెట్టిన బంపర్ ఆఫర్ తో అందరు చికెన్ ను ఎగబడి మరీ కొంటున్నారు. తమ జిహ్వ చాపల్యం కోసం ఎంత సమయమైనా నిలబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చికెన్ ఆఫర్ అందరిలో సంబరం నింపుతోంది.
అందరిలో ఆకర్షణ
ఈ రోజుల్లో ఏది కొనాలన్నా చుక్కలే. ధరలు అలా ఉన్నాయి. దీంతో చికెన్ కిలో 99 ఆఫర్ అందరిని ఆకట్టుకుంటోంది. తక్కువ ధరకే నోరూరించే చికెన్ అందుబాటులో ఉండటంతో అందరికి పగ్గాలు లేవు. సింపుల్ గా కొనుగోలు చేసి తింటున్నారు. ఇటు కడుపు నిండుతుండగా అటు ధర తక్కువగా ఉండటంతో ఎవరు కూడా ఆలోచించడం లేదు. చికెన్ తెచ్చుకుని తినాలని చూస్తున్నారు. హాయిగా తింటూ కమ్మగా ఉందని చెబుతున్నారు.