BRS vs Congress : బీఆర్‌ఎస్‌ ‘పవర్‌’ రాజకీయం.. పేటెంట్‌తో తిప్పికొట్టిన కాంగ్రెస్‌ !

తెలంగాణలో కాంగ్రెస్‌ జోరును తట్టుకోవటంపైన ప్రగతి భవన్‌లో మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్‌ను ఎలా బద్నాం చేయాలనే ఆలోచన చేస్తున్న తరుణంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు వారికి అస్త్రంగా మారాయి.

  • Written By: NARESH
  • Published On:
BRS vs Congress : బీఆర్‌ఎస్‌ ‘పవర్‌’ రాజకీయం.. పేటెంట్‌తో తిప్పికొట్టిన కాంగ్రెస్‌ !

BRS cs Congress : ఉచిత విద్యుత్‌కు నాంది కాంగ్రెస్‌. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కల కాంగ్రెస్‌ పాలనలోనే నెరవేరింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ జోరు పెరుగుతున్న వేళ బీఆర్‌ఎస్‌ పవర్‌ రాజకీయం మొదలు పెట్టింది. వక్రీకరణ, కుట్రలకే కేరాఫ్‌ చిరునామాగా మారిన ప్రగతి భవన్‌లో కొత్త స్కెచ్‌ సిద్ధం చేశారు. రేవంత్‌ వ్యాఖ్యలను వక్రీకరించి, కాంగ్రెస్‌కు ఉచిత విద్యుత్‌ రద్దంటుందని ఆగమాగం చేస్తున్నారు. అధికార గులాబీ నేతలు రోడ్డె్డక్కారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమ ప్రభుత్వంలో మొదలైన ఉచిత విద్యుత్‌నే కేసీఆర్‌ కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రారంభించింది కావటంతో తన పథకాల లాగా రద్దు చేసే ధైర్యం చేయలేకపోతున్నారు అని నేతలు ధీటుగా బదులిస్తున్నారు.

కాంగ్రెస్‌ స్పీడ్‌కు కల్లెం వేసేలా..
తెలంగాణలో కాంగ్రెస్‌ జోరును తట్టుకోవటంపైన ప్రగతి భవన్‌లో మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్‌ను ఎలా బద్నాం చేయాలనే ఆలోచన చేస్తున్న తరుణంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు వారికి అస్త్రంగా మారాయి. కట్‌ పేస్ట్‌ నైపుణ్యంతో ఒక వీడియో బయటకు తీసుకొచ్చారు. అంతే, రైతులకు ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్‌ వ్యతిరేకమనే ప్రచారం తెర మీదకు తెచ్చారు. పార్టీ నేతలంతా రోడ్డు మీదకు రావాలని ఆదేశాలిచ్చారు. కాంగ్రెస్‌లో ప్రజలకు మద్దతు పెరుగుతున్న వేళ రాజకీయంగా అడ్డుకునేందుకు అస్త్రాలు లేవు. దీంతో, అసత్యాలే ఆయుధంగా ప్రచారం ప్రారంభించారు.

కౌంటర్‌తో ఎటాక్‌..
ఇదే సమయంలో కాంగ్రెస్‌ ముఖ్య నేతలు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధు యాష్కీ లాంటి వారు బీఆర్‌ఎస్‌పై కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. అసలు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ప్రారంభించిందే కాంగ్రెస్‌ అని స్పష్టం చేశారు. 2004 ఎన్నికల వేళ నాటి సీఎం చంద్రబాబు ఉచిత విద్యుత్‌ సాధ్యం కాదు.. అదే చేస్తే రైతులు కరెంట్‌ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌గా నాటి సీఎల్పీ నేత వైఎస్సార్‌ తన పాదయాత్రలో ఉచిత విద్యుత్‌ హామీ ఇచ్చారు. రైతులు కాంగ్రెస్‌ నేతగా వైఎస్సార్‌ ఇచ్చిన హామీని నమ్మారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. అధికారంలోకి వస్తూనే నాటి కాంగ్రెస్‌ సీఎంగా ఉచిత విద్యుత్‌ నిర్ణయంపై తన ప్రమాణ స్వీకార వేదిక పైనే 2004లో సంతకం చే శారని గుర్తు చేస్తున్నారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌ అమలు ప్రారంభం అయింది. ఆ తరువాత రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ కు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

మేనిఫెస్టో రూపకల్పనలో కాంగ్రెస్‌..
ఇదిలా ఉంటూ భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ద్వారా అనేక సమస్యలు తెలుసుకున్నారు. వీటి ఆధారంగా వచ్చే ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈమేరకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కూడా ప్రకటన చేశారు. మరోవైపు ఇప్పటికే రైతులు..మహిళలు..యువతే లక్ష్యంగా కాంగ్రెస్‌ మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారు. డిక్లరేషన్లు ప్రకటించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ఉక్కిరిబక్కిరి అవుతోంది. రైతులకు ఇంకా ఎంత మేలు చేయాలని నిరంతరం ఆలోచించే పార్టీ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్‌ సమయాన్ని తగ్గించాలనే ఆలోచన తమకు లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ కచ్చితంగా రైతు పక్షపాత పార్టీగా..అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి వారికి మేలు చేసే నిర్ణయాల దిశగానే అడుగులు వేస్తామని భట్టి స్పష్టంగా ప్రకటించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో బడ్జెట్‌ కేటాయింపుల్లో రైతులకు రెట్టింపు కేటాయింపులు.. డబుల్‌ ఆదాయం వచ్చేలా నిర్ణయాలు ఉంటాయని భట్టి విక్రమార్క తెలంగాణ రైతాంగానికి హామీ ఇచ్చారు. పార్టీ క్యాంపెయనర్‌ ఎంపీ కోమటిరెడ్డి అదే విషయాన్ని స్పష్టం చేశారు.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు