Padmavathi Telangana Ministers : ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ నేపథ్యంలో మొన్న ఢిల్లీ వెళ్ళిన కవిత కు.. సంఘీభావంగా తెలంగాణ మహిళా మంత్రులు వెళ్లారు. సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మహబూబాబాద్ జడ్పీ చైర్ పర్సన్ ఆంగోత్ బిందు పలువురు ఢిల్లీ వెళ్ళిన వారిలో ఉన్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ వంటి వారంతా తెలంగాణ భవన్లో బస చేశారు. కవిత ను ఈడి విచారిస్తున్న క్రమాన్ని తమకున్న నెట్వర్క్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రగతి భవన్ కు చేరవేశారు.
మరి ఇదంతా జరుగుతున్నప్పుడు మహిళా మంత్రులు ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్న సాధారణంగా మెదులుతుంది.. వారు తుగ్లక్ రోడ్ లోని కెసిఆర్ నివాసంలో ఉన్నారా? అని ఆరా తీస్తే అక్కడ లేరు.. కానీ వారికి ఆతిథ్యం ఇచ్చింది కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి. సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఆంగోత్ బిందు వంటి వారంతా పద్మావతి ఇంట్లోనే బస చేశారు.. కవిత విచారణ ముగిసిన తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లే వరకు వారు అక్కడే ఉన్నారు.
అయితే పద్మావతి, తెలంగాణ రాష్ట్ర మహిళా మంత్రులు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. దీనిని బిజెపి ఐటి సెల్ విస్తృతంగా ప్రచారం చేసింది. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ ఒకటేనని, మద్యం కుంభకోణం లో చిక్కుకున్న కవితకు కాంగ్రెస్ పార్టీ పట్టాసు పలుకుతుందని ఆరోపించింది.. తెలంగాణ మహిళా మంత్రులకు పిసిసి మాజీ అధ్యక్షుడు భార్య ఆతిథ్యం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించింది.
మరోవైపు ఈ ఫోటో బయటకు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మ రక్షణలో పడింది.. మొన్నటిదాకా బిజెపి, భారత రాష్ట్ర సమితి ఒకటేనని ప్రచారం చేసిన కాంగ్రెస్.. తాజా పరిణామంతో నాలుక కరుచుకుంది. కాగా దీనిపై ఉత్తంకుమార్ రెడ్డి వర్గీయులు మాత్రం.. ప్రత్యర్థులను మనుషులను చూసే నైజం తెలంగాణకు ఉంది, అతి తెలంగాణ సంస్కృతిలో భాగమంటూ వివరణ ఇచ్చారు.. కానీ అప్పటికే జరగాల్సి జరిగిపోయింది నష్టం జరిగిపోయింది. మద్యం కుంభకోణంలో విచారణకు హాజరైన ఓ అవినీతి పరురాలికి సంఘీభావంగా వెళ్ళిన మంత్రులకు ఉత్తంకుమార్ రెడ్డి సతీమణి ఆతిథ్యం ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి ఉత్పన్నమవుతున్నాయి.