Brahmanandam: బ్రాహ్మానందం.. తెలుగు తెరపై చెరగని చిరునవ్వును శాశ్వతంగా ఉంచి గొప్ప కమెడియన్. ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని ఆయన పంచారు. కానీ ఇప్పుడు సినిమాలు బాగా తగ్గించేశారు. అయినా ఎందుకు ఎక్కువగా సినిమాలు చేయడం లేదు.? సెలెక్టెడ్ గా మాత్రమే సినిమాలు ఎందుకు చేస్తున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే తాను యాక్టింగ్ కు ఎందుకు దూరంగా ఉన్నానో బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు. తాను కెరీర్‌కి రెస్ట్ ఇవ్వడం లేదని, కేవలం శరీరానికి మాత్రమే విశ్రాంతి ఇస్తున్నానని బ్రహ్మానందం తెలిపారు. తనకు నటించేందుకు ఎన్నో అవకాశాలు వస్తున్నా స్వచ్ఛందంగా కొందరికే పరిమితమవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

tollywood comedian bramanandham got another honour
“నేను ఉదయం 9 గంటలకు వస్తానని, సాయంత్రం 6 గంటలకల్లా సెట్స్ నుంచి వెళ్లిపోతానని చాలా మంది చెబుతుంటారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య రిలాక్స్ అవుతాను అనే టాక్ కూడా ఉంది. అంతా నిజమే. నేను గత 35 ఏళ్ల నుంచి 3-4 షిఫ్టులు పనిచేశాను. ఆ రోజుల్లో 3 రాష్ట్రాల మధ్య షూటింగ్ చేసిన అనుభవం ఉంది. నేను కూడా వివిధ చోట్ల తిండికి సరిపడక చాలాసార్లు వాంతులు చేసుకున్నాను. రాత్రుళ్లు డబ్బింగ్ చెప్పుకుంటూ మళ్లీ ఉదయం షూటింగులకు పరిగెత్తేవాడిని. ఇప్పుడు నా శరీరానికి విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాను. నేను రిలాక్స్‌గా ఉండటానికి కొంత డబ్బును పోగొట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు” అని బ్రహ్మానందం అసలు నిజాన్ని బయటపెట్టాడు.
తాను సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఫ్యాన్స్ మాత్రం మీమ్స్ తో తనను అందరికీ చేరువ చేస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. తన చిత్రాలు -ఎక్స్‌ప్రెషన్స్‌తో మీమ్స్ సర్క్యులేట్ అవ్వడం చూసి సంతోషంగా ఉన్నానని బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు.
Also Read: ఏపీ వరద బాధితులకు అండగా అల్లుఅర్జున్.. భారీ విరాళం ప్రకటన
“నా ముఖంతో మీమ్‌లు సృష్టించే వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో నేను సినిమాల్లో నటించడం లేదు, కానీ ఈ కుర్రాళ్ళు మీమ్‌లతో ప్రజలకు ఎంటర్ టైన్ మెంట్ పంచుతూ నన్ను మరింత పాపులర్ చేసారు. సరైన మీమ్ కోసం సరైన వ్యక్తీకరణను ఎంచుకోవడంలో వారి ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను’’ అని బ్రహ్మానందం ఆనందం వ్యక్తం చేశారు.
మనవడితో ఆడుకుంటున్నానని.. తన పెయింటింగ్ యాక్టివిటీతో ఆనందంగా గడుపుతున్నానని బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు. టైం టేబుల్ ప్రకారమే పనిచేస్తానని.. ఇప్పుడు నటించేందుకు సిద్ధమని అన్నారు.
Also Read: పోలీసు స్టేషన్‌కు సూపర్‌స్టార్ మహేశ్ సోదరి.. ఎందుకో తెలుసా?