Boyapati – Ram Pothineni Movie : బోయపాటి ప్లాన్ అదుర్స్… రామ్ పోతినేని సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్డ్!
Boyapati – Ram Pothineni Movie : ఇస్మార్ట్ శంకర్ మూవీతో భారీ హిట్ కొట్టిన రామ్ పోతినేని మరలా రేసులో వెనుకబడ్డారు. ఆయన గత రెండు చిత్రాలు రెడ్, ది వారియర్ ఆశించినంతగా ఆడలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ది వారియర్ రామ్ పోతినేనికి షాక్ ఇచ్చింది. కాగా బోయపాటి శ్రీనుతో ప్రాజెక్ట్ ప్రకటించి ఆయన ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన దర్శకుడితో మూవీ అనేసరికి అంచనాలు […]

Boyapati – Ram Pothineni Movie : ఇస్మార్ట్ శంకర్ మూవీతో భారీ హిట్ కొట్టిన రామ్ పోతినేని మరలా రేసులో వెనుకబడ్డారు. ఆయన గత రెండు చిత్రాలు రెడ్, ది వారియర్ ఆశించినంతగా ఆడలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ది వారియర్ రామ్ పోతినేనికి షాక్ ఇచ్చింది. కాగా బోయపాటి శ్రీనుతో ప్రాజెక్ట్ ప్రకటించి ఆయన ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన దర్శకుడితో మూవీ అనేసరికి అంచనాలు పెరిగిపోయాయి. అందులోనూ ఇది పాన్ ఇండియా చిత్రం. ఐదు భాషల్లో పెద్ద ఎత్తున విడుదల చేయనున్నారు.
యాభై శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. దీంతో విడుదల తేదీ ప్రకటించారు. 2023 దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ చిత్రం విడుదల చేస్తున్నట్లు అధికారికంగా తెలియజేశారు. దసరా స్లాట్ బోయపాటి-రామ్ బుక్ చేసుకున్నారు. సంక్రాంతి తర్వాత అంత డిమాండ్ ఉన్న సీజన్ గా దసరాకు పేరుంది. కాబట్టి ఇది రామ్ పోతినేని సినిమాకు కలిసొచ్చే అంశమే.
ఇక విడుదల తేదీ ప్రకటన పోస్టర్ అదిరిపోయింది. రామ్ పోతినేని మాస్ అవతార్ కిక్ ఇచ్చింది. ఒంటి చేత్తో దున్నపోతును ఆయన అదుపు చేస్తున్న పొగరు చూస్తుంటే గూస్ బంప్స్ కలుగుతున్నాయి. జాతర నేపథ్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన స్టిల్ అనిపిస్తుంది. బోయపాటి చిత్రాల్లో యాక్షన్ సీక్వెన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలకు బోయపాటి పెట్టింది పేరు. రామ్ పోతినేనిని నెవెర్ బిఫోర్ అవతార్ లో ప్రజెంట్ చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం.
ఇక శ్రీలీల హీరోయిన్ గా నటించడం మరొక కలిసొచ్చే అంశం. ఆమె రోల్ ఈ చిత్రంలో చాలా ప్రత్యేకమన్న మాట వినిపిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్లో శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ పోతినేని హిందీ డబ్బింగ్ చిత్రాలు యూట్యూబ్ లో సంచలనాలు చేశాయి. ఈ క్రమంలో నార్త్ ఇండియాలో రామ్ పోతినేని సంచలనాలు చేస్తారని మేకర్స్ భావిస్తున్నారు. ఇక టైటిల్ ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రం విజయం మీద రామ్ చాలా ఆశలే పెట్టుకున్నారు.
https://twitter.com/SS_Screens/status/1640340283471831041?s=20