Boyapati Srinu : యాక్షన్ చిత్రాల దర్శక దిగ్గజం బోయపాటి శ్రీను ‘అఖండ’తో అఖండమైన విజయాన్ని సాధించి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను రామ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే, తాను తీసిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. దాంతో రామ్ తో చేస్తున్న చిత్రానికి బోయపాటి, హీరో రామ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్న ఈ చిత్రానికి రామ్ రూ.11 కోట్లు తీసుకుంటే, బోయపాటి రూ.13 కోట్లు తీసుకుంటున్నాడు.

Boyapati With Ram Pothineni
ఈ మేరకు అగ్రిమెంట్ కూడా అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి, బోయపాటికి హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం రామ్ 12 కోట్లు తీసుకున్నాడు. అయితే, బోయపాటి సినిమా కోసం మాత్రం రామ్ తన రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నాడు.
రామ్, ఎప్పటి నుండో మాస్ హీరోగా ఎలివేట్ అవ్వాలని ఆశ పడుతున్నాడు. ఈ క్రమంలోనే బోయపాటి రామ్ కి ఒక కథ చెప్పాడు. కథ కూడా రామ్ కి బాగా నచ్చింది. అందుకే.. బోయపాటి కోసం తన రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నాడు. ఇక వీరిద్దరి కలయికలో రానున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ చిత్రం తర్వాత బోయపాటి అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
ఆ తర్వాత బాలయ్యతో అఖండ 2 సినిమా చేస్తాడట. పైగా ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే. అంటే.. బోయపాటి వరుసగా 3 పాన్ ఇండియా సినిమాలు చేయబోతున్నాడు. ఏది ఏమైనా అఖండ సినిమా రికార్డు కలెక్షన్స్ దక్కించుకోవడం, బోయపాటికి తిరుగులేకుండా పోయింది. ‘అఖండ’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది.
బోయపాటి కారణంగా నటసింహం బాలయ్య తన స్టార్ డమ్ ఏమిటో మరోసారి ఘనంగా బాక్సాఫీస్ సాక్షిగా గొప్పగా చాటుకున్నాడు. చాటుకున్నాడు అనడం కంటే.. బోయపాటి చాటాడు అనడం కరెక్ట్ ఏమో. అందుకే. బోయపాటికి ఈ డిమాండ్.