
Border Gavaskar Trophy 2023
Border Gavaskar Trophy 2023: ఒకప్పుడు యాషెస్ టోర్నీని ఆస్ట్రేలియా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా ధోరణి మారింది.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ప్రతిష్టాత్మకంగా భావించే స్థాయికి వచ్చింది. ఎందుకంటే 1996 వరకు భారత్ పై ఆధిపత్యం చలాయించిన ఆస్ట్రేలియాకు… తర్వాత మెన్ ఇన్ బ్లూ టీం చుక్కలు చూపిస్తోంది.. ముఖ్యంగా గత మూడు సిరీస్ లను భారత్ ఓడిసి పట్టింది. ప్రపంచ క్రికెట్ ను శాసించిన ఆస్ట్రేలియా… భారత్ ముందు మాత్రం తలవంచుతోంది. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా టోర్నీ లో విజయం సాధించి కప్ ఎగరేసుకుపోవాలని చూస్తోంది.
భారత్ పిచ్ లు స్పిన్ కు అనుకూలంగా ఉంటాయి. బంతిని గింగిరాలు తిప్పడంలో, బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టడంలో భారత బౌలర్లు సిద్ధహస్తులు. గతంలో జరిగిన పలు టోర్నీల్లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ ను నిలువునా కూల్చేశారు.. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ ధాటికి ఆస్ట్రేలియా పేక మేడలా కూలిపోయింది. గురువారం జరగబోయే నాగపూర్ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే కాదు మిగతా బౌలర్లు కూడా మెరుగ్గా బౌలింగ్ వేస్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ కూడా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.. అయితే ఈసారి కేవలం అశ్విన్ మాత్రమే కాదు రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ ను కూడా కాచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కులదీప్ యాదవ్ ను కనక తీసుకుని ఉంటే ఆస్ట్రేలియా కు కష్టాలు తప్పవు.
అయితే సిరీస్ విజయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఆస్ట్రేలియా రకరకాల ప్రయోగాలు చేస్తోంది. భారత బౌలర్లను కాచుకునేందుకు సిద్ధమవుతోంది. గత కొద్దిరోజులుగా నాగపూర్ పిచ్ పై సాధన చేస్తున్నది. అశ్విన్ మాదిరిగా తన బౌలర్లతో బౌలింగ్ వేయిస్తూ ప్రాక్టీస్ చేస్తోంది.. అయితే నాదన్ లయన్, స్వైపన్స్, అగార్ తో వైవిధ్యంగా బంతులు వేయిస్తుంది.

Border Gavaskar Trophy 2023
అయితే మైదానాన్ని స్పిన్ కు అనుకూలంగా మార్చడంతో కేవలం ఆస్ట్రేలియా మాత్రమే కాదు ఇండియాకు కూడా ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా స్పిన్ పిచ్ ల పై ఇటీవల భారత బ్యాట్స్మెన్ పెద్దగా గొప్ప స్కోరులు చేసిన దాఖలాలు లేవు.. ఈ జాబితాలో భారత రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పై చెన్నైలో 161 పరుగులు చేశాడు.. కానీ మిగతా బ్యాట్స్మెన్ వెంటవెంటనే అవుట్ అయ్యారు. స్థూలంగా చెప్పాలంటే స్పిన్ పిచ్ ఆస్ట్రేలియాకే కాదు మనకు కూడా ఇబ్బందే.