Janhvi Kapoor: ఆ హీరోతో నటించడానికి ససేమిరా అన్న జాన్వీ కపూర్ తండ్రి… కారణం!

తమిళ స్టార్ హీరో విజయ్ లేదా మరో స్టార్ హీరో అజిత్ సినిమాలతో మాత్రమే జాన్వీ కపూర్ తమిళ పరిశ్రమలోకి అడుగు పెట్టాలని ఆమె తండ్రి బోనీ కపూర్ ఆలోచన అని తెలుస్తుంది.

  • Written By: Shiva
  • Published On:
Janhvi Kapoor: ఆ హీరోతో నటించడానికి  ససేమిరా అన్న జాన్వీ కపూర్ తండ్రి… కారణం!

Janhvi Kapoor: జాన్వీ కపూర్ లెజండరీ హీరోయిన్ అందాల తార శ్రీదేవి నట వారసురాలిగా సినీ రంగప్రవేశం చేసిన ఈ చిన్నది. తల్లికి తగ్గట్లే హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది. అయితే శ్రీదేవి తన కెరీర్ ను సౌత్ లో బిల్డ్ చేసుకొని నార్త్ లోకి వెళ్ళింది. తెలుగు,తమిళ్ లో అగ్రశ్రేణి హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. తల్లి బాటలో నడుస్తున్న జాన్వీ కపూర్ కూడా సౌత్ లో తన సత్తా చాటాలని ఎప్పటి నుండో అనుకుంటుంది.

దానికి తగ్గట్లే టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్ సరసన కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “దేవర” సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. సౌత్ లో జాన్వీ కపూర్ చేస్తున్న మొదటి సినిమా ఇదే. అదే విధంగా తమిళ్ లో కూడా నటించడానికి సిద్ధం అవుతుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ మధ్య ఎక్కువగా తమిళ సినిమాలు కూడా చూస్తుంది జాన్వీ. తెలుగులో అయితే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో కూడా మరో స్టార్ హీరో సినిమా తో అడుగుపెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

తమిళ స్టార్ హీరో విజయ్ లేదా మరో స్టార్ హీరో అజిత్ సినిమాలతో మాత్రమే జాన్వీ కపూర్ తమిళ పరిశ్రమలోకి అడుగు పెట్టాలని ఆమె తండ్రి బోనీ కపూర్ ఆలోచన అని తెలుస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఇక్కడే మరో వైరల్ న్యూస్ వినిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా హీరో ధనుష్ సినిమా ద్వారా మాత్రం ఎంట్రీ ఇవ్వకూడదని, మొదటి సినిమా అతని సరసన నటించవద్దని బోనీ కపూర్ జాన్వీ కి కండిషన్ పెట్టినట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియడం లేదు. కోలీవుడ్ నుండి హాలీవుడ్ దాకా ఎదిగిన ధనుష్ లాంటి హీరో సరసన నటించ వద్దని బోనీ కపూర్ ఎందుకు సలహా ఇస్తాడు? . నిజానికి అజిత్ తో శ్రీదేవి కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఆ చనువుతో అతని సినిమా ద్వారా తమిళ తెరంగ్రేటం చేస్తే బాగుంటుందని బోనీ కపూర్ అనుకోవడంలో తప్పు లేదు. కానీ ధనుష్ సరసన మాత్రం ఎంట్రీ వద్దు అన్నాడు అనేది మాత్రం అంత నమ్మదగిన వార్త అయితే కాదు. ఇలాంటి వార్తలు వలన ఇప్పుడిప్పుడే సౌత్ కెరీర్ మొదలుపెడుతున్న జాన్వీ కి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది .

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు