Human Relationships: సృష్టిలోని జీవరాశిలో భాగమైన మనిషి తన జీవన గమనాన్ని కొనసాగించే క్రమంలో జీవ లక్షణాలను అనుకరిస్తున్న మాట వాస్తవం. అయితే క్రిమి కీటకాలు పశుపక్షాదులు జంతువులు క్రూర మృగాలు సర్పాలు ఇవన్నీ కంటికి కనిపించని ఏకకణం నుంచే ఉద్భవించాయి. ఈ సృష్టి లోని జీవరాశి బహుశా తమకంటూ ఒక లక్ష్యం లేకుండానే పుట్టాం కనుక చావాల్సిందే అనే పద్ధతిలో జీవన చక్రాన్నీ కొనసాగిస్తున్నవి. అయినప్పటికీ వాటికి తెలియకుండానే ప్రకృతి, సమాజం,ఇతర జీవరాశికి మేలుచేస్తున్న సందర్భాలు గమనిస్తే మనిషి అంతకంటే హీనంగా బ్రతకడాన్ని ఏమందాం? పుట్టుకతో ఇతర జీవరాశికి భిన్నంగా ఆలోచన, వివేకం, విచక్షణ వంటి స్వభావాలు మనిషికి ఉన్న కారణంగా జీవితానికి ఒక సార్థకతను సాధించే లక్ష్యంతో పనిచేస్తున్న వాళ్లు కొందరైతే లక్ష్యం లేకుండా పుట్టాము కనుక బతకాలి బతుకుతున్నాం కనుక చివరికి ఎలాగో చావాల్సిందే అని ఆలోచనతో గుడ్డిగా జీవితాన్ని గడుపుతున్న వాళ్లు కూడా అనేక మంది మనలో ఉన్నారు.

Human Relationships
పుట్టుక చావు మధ్యన ఉన్నటువంటి జీవితాన్ని అర్థవంతంగా చేసుకునే క్రమంలో స్వార్థం, అహంకారం, దుర్మార్గం, దుష్ట స్వభావాల కారణంగా మనిషి. అనేకసార్లు ఓడిపోతూ పశుపక్షా దుల కంటే హీనంగా చూడబడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నీకంటే పశువు నయం, నీదే మి పుట్టుక? రాక్షస పుట్టుక, మనిషి పుట్టుక పుట్టలేదా? అని అప్పుడప్పుడు మనుషు లను మనుషులే నిందిస్తున్న సందర్భాల ను మన జీవితంలో అనేకసార్లు ప్రత్యక్షంగా చూసి ఉన్నాము. ఇది ఏదో వేదాలలో ఉన్నది కాదు. అనుభవాన్ని సంఘట నలకు జోడించి, పరిశీలన ద్వారా మనుషుల అభిప్రాయాలను కూడగట్టి, మెజారిటీ అభిప్రాయాలను అంచనా వేసి ఒక నిర్ణయానికి రావడం మాత్రమే ఈ వ్యాసానికి ప్రతిపాధిక. ఈ విషయా లన్నీ తెలియనివి కావు కానీ పూసలతో పువ్వులతో దండలను అల్లినట్లు అనుభవాలు, జ్ఞాపకా లు , సంఘటనలు, సందర్భాలు నెమరు వేసుకోవడం ద్వారా మనము విస్మరిస్తున్న బాధ్యతలు, మరిచి పోతున్న లక్ష్యాలు, తప్పటడుగులు వేస్తున్న జీవిత రహదారులను శుద్ధి చేసుకోవడానికి, సవరించుకోవడానికి ఏ మేరకైనా ఉపయోగప డుతుందనే ఉద్దేశంతో మాత్రమే ఈ వ్యాసం..
– ఉన్ననాడే చూసుకోని సరిచేసుకోవాలి :-
కుటుంబ బంధాలలో కానీ మానవ సంబంధాల విషయంలో కానీ వ్యక్తులు జీవించినంత కాలం నిర్లక్ష్యానికి గురవుతూ ఉంటారు. అనుకో కుండా ఊహించని దుస్సంఘటనలు జరిగినప్పుడు, మృత్యుకోహరం లోకి చేరినప్పుడు, మృత్యువును ముద్దాడినప్పుడు, కోమాలోకి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు పశ్చాత్తాప పడడం మనిషి వంతు అవుతున్నది. అదే మనిషి జీవించి ఉన్నప్పుడు భార్య లేదా భర్త కావచ్చు తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఎవరినైనా గౌరవ మర్యాదలను పక్కనపెట్టి, కనీస ఆత్మీయ ఆప్యాయత అనురాగాలను కూడా పంచడానికి ఇష్టపడని దుర్మార్గపు లక్షణాలు కలిగిన మానవాళి చనిపోయిన తర్వాత మాత్రం ఏదో కోల్పోయి నట్లు, ఎంతో త్యాగం చేసినట్లు, బ్రతికుంటే ఎంతో మేలు చేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రేమ ఒ లకబోస్తూ ఉంటారు. శవం పక్కన నిలబడి సానుభూతి చూపే ప్రయత్నం చేయడం, భార్యాభర్తలతో మొదలు కొంటే కుటుంబ సభ్యులు బంధువుల వరకు కూడా ఇదే కొనసాగుతుందని అర్థం చేసుకోవచ్చు. పలకరించింది లేదు, భోజనం పెట్టింది లేదు, అనారోగ్య పరిస్థితుల్లో సేవ చేసింది లేదు, చికిత్స పొందే క్రమంలో తోడ్పాటునందించింది లేదు. ఇలాంటి కుటుంబాలను మనం మెజారిటీగా చూడవచ్చు . ఉన్ననాడే, బ్రతికి ఉన్ననాడే ప్రేమలు పంచని వ్యక్తులు చనిపోయిన తర్వాత మాత్రం చర్చ గోస్టులు, కథనాలు, ప్రసంగాలు, సానుభూతి వచనాలతోలోకాన్ని అలరింప చేస్తూ ఉంటారు. ఇది మీ అనుభవంలో లేదంటారా ? ఒకనాడు కాకపోయినా ఒకనాడు అయినామనిషిని మనిషిగా చూడగలిగే, మానవత్వాన్ని ప్రదర్శించి, చేసిన తప్పులను నిర్లక్ష్యాన్ని అవమానాన్ని పట్టించుకోని తనాన్ని సవరించుకోవడానికి ప్రయత్నం గనుక చేస్తే మనిషి మహోన్నతుడౌ తాడు. కావలసినది ఈ సమాజానికి అదే కదా! అందుకే మనిషి సవరించుకోవడానికి అనేక లోయలు, మిట్ట పల్లాలు, ఆటుపోట్లు నిత్యం ఎదుర్కొంటున్న ప్పటికీ తనదాకా వస్తే కానీ చలించనటువంటి మూర్ఖపు లక్షణం కలిగి ఉన్న కారణంగా బ్రతికి నా చనిపోయిన వారితో సమానులవుతున్నారు. ఇటీవల కాలంలో అకస్మాత్తుగా గుండెపోటు లేదా ఇతర ప్రమాదాల కారణంగా చనిపోతే బాగుండునని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడి శరీరము శుష్కించి చావడానికి ఇష్టపడనటువంటి మెజారిటీ ప్రజలను చూస్తూ, వారి అభిప్రా యాలను మనం నిత్యం వింటూనే ఉన్నాము.
– చావంటే భయపడొద్దు..
మనిషి జీవితానికి ఒక సార్థకత ఉండాలని అనుకున్నప్పుడు విద్య ఒక పార్శం మాత్రమే. నిరక్షరాష్యులు, పేదలు, అమాయకులు సైతం మానవతా విలువలను పునికి పుచ్చుకొని విద్యావంతులైన మూర్ఖుల కంటే మెరుగుగా బ్రతుకుతున్న విషయాలను మనం గమనిస్తే చావంటే భయపడకుండా అర్థాన్ని నిర్వచించుకొని, ఆత్మీయులను పెంచుకొని, మనిషిని మనిషిగా పలకరించుకొని, ఇతరుల సేవలో తరించి , కష్ట సుఖాలలో ధైర్య0తో తోడుగా ఉండడానికి ఇష్టపడే వాళ్లను మనం గుర్తించాలి. గౌరవించాలి. వాళ్లను ఈ సమాజానికి ఆదర్శంగా నిలబెట్టవలసిన అవసరం చాలా ఉన్నది. కానీ పేదలు, అభాగ్యులు, నిరక్షరాష్యులు ,అమాయకులను ఈ సమాజం ఏ రకంగా చూస్తున్నదో మనందరికీ తెలిసినదే. “సంపదలు , ఆస్తులు, రాజభవనాలు ఉండి అనారోగ్యంగా ఉన్నటు వంటి వారి కంటే గుడిసెలో నివసిస్తున్న టువంటి పేదవాళ్లు ఎక్కువ సుఖపడుదురు” అని పూర్వకాలంలో పెద్దగా ఒక వాక్యం ప్రచారంలో ఉండేది . దానిని గనక జీవితానికి అనువయిం చుకుంటే సంపన్నులు, మేధావులు, విద్యావంతులై స్వార్థపూరితంగా జీవించే వారి కంటే ప్రేమ హృదయము కలిగి, మానవతా దృక్పథాన్ని పెంపొందించుకొని, తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సంస్కారాన్ని పెంచుకున్నటువంటి పేదలు నిరక్షరాశులయినా మనుషులు గా గుర్తించబడతారు. గౌరవించబడతారు. నిజమయిన జీవితానికి సార్థకత చేకూర్చుకున్నది కూడా వారే అవుతారు .
– నీతి నిజాయితీ మనిషి ఉనికికి పరీక్ష కావాలి :
ప్రతివాడు ఆనందంగా జీవించాలని, సంపన్న కుటుంబంలోజన్మించాలని, రాజభవనాలు నిర్మించుకోవాలని, కుటుంబ సభ్యులు కొడుకులు కోడలు బిడ్డలు అల్లుళ్లు అందరూ ఉద్యోగస్తులై త మ కుటుంబం మెరుగుగా బతకాలని కోరుకునే వారే. కానీ తాము పొందిన జ్ఞానం, తమ ఉనికి కోసం చదువు కోసం ఈ సమాజం వెచ్చించిన డబ్బు ద్వారా పొందిన ప్రయోజనాన్ని ఇదే సమాజానికి మరో రూపంలో త్యాగం చేయడానికి మాత్రం ఏ కుటుంబం కూడా సిద్ధంగా లేదు అనడానికి ఈరోజు ప్రతి కుటుంబంలో స్వార్థపూరిత లక్షణాలను ప్రదర్శిస్తున్న వారిని చూస్తే గాని అర్థం కాదు. కుటుంబం ఎదగాలని ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలని పెద్దలు చెప్పేవారు. కానీ నేడు ఎదుగుదల అంటే తను జీవిస్తూ ఇతరులను జీవించేలా ప్రోత్సహించడం, తను బ్రతుకుతూ ఇతరులను బ్రతికేలా సమర్థించడం , తనకు తెలిసిన జ్ఞానాన్ని అవకాశాలను విద్యను ఇతరులకు కూడా అందించి తమలా గా ఇతర కుటుంబాలు కూడా బతకాలని ఆశించే స్థాయిలో మాత్రం నేటి ప్రజలు లేరు .
నైతిక విలువలు, మానవతా విలువలు, నీతి నిజాయితీ, కట్టుబాట్లు, సేవా తత్పరత , ఆపదల్లో ఆదుకోవడం, మంచిని పంచడం, మనిషిని ప్రేమించడం వంటి లక్షణాలను మనిషి ఎప్పుడో పోగొట్టుకొని డాక్టర్ అందెశ్రీ అన్నట్టుగా ‘మాయమ వుతున్నడమ్మా మనిషన్నవాడు’ అని నిర్వేదంగా పాడుకొనే దుస్థితి ఈనాడు సమాజంలో దాపురించినది. ఇది మీ అనుభవంలో లేదంటా రా? ఉంటే ఏ రకంగా స్పందిస్తున్నారు ? పరిశీలించండి… ఆలోచించండి..చర్చించండి .ప్రత్యామ్నాయాలతో సమాజం ఉన్నతికి పాల్పడండి .ఇదే ఈ వ్యాసం ద్వారా ప్రజలకు, సమాజానికి, సామాజిక కార్యకర్తలకు,మెరుగైన సమాజ నిర్మాణాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి చేస్తున్న విజ్ఞప్తి.

Human Relationships
ఒక మనిషి చనిపోయినప్పుడు, ఆపద సంభవించినప్పుడు, ప్రమాదము జరిగినప్పుడు ఒక కుటుంబంలో జరిగినటు వంటి విషాద సంఘటన నేపథ్యంలో కుటుంబ సభ్యులతో పాటు ఇతర కుటుంబాల వాళ్లు కూడా ఎంతో సానుభూతిగా ఇకముందు తప్పు చేయకూడదు, బ్రతికినంత కాలం అందరం కలిసి మనుషులుగా బతకాలి, మాట్లాడుతూనే ఉండాలి, కుట్రలు కుతంత్రాలను విడిచిపెట్టాలి, జీవితం అశాశ్వతం గాలి బుడగ వంటిది ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు, అలాంటి అశాశ్వతమైన జీవితానికి ఇంత పంతాలు, పట్టింపులు, రాద్ధాంతాలు ఎందుకు? అని అనుకుంటాము. కానీ తెల్లవారిన తర్వాత మన నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తూ అసూయ ద్వేషాలు, అహంకారం, గర్వం ,కోపం, పగ ,శత్రుత్వాలను పెంచుకొని తల్లిదండ్రులు ఆడుబిడ్డలు ఇతర కుటుంబ సభ్యులు అత్తమామల వంటి ప్రధానమైన వ్యక్తులను కూడా మందలించ కుండా మాట్లాడకుండా క్షేమ సమాచారాలు తెలుసుకోకుండా వారిని బానిసలుగా, యాచకులుగా, బిచ్చగాళ్ళుగా చూడడానికి వెనుకాడడం లేదు.. లేదా అనే అనుభవం మీకు ఎప్పుడైనా జీవితంలో చోటు చేసుకున్నదా? ఇది నిజం కాదంటారా? నిజం అయితే దీనికి పరిష్కారం ఏమిటి? అందుకే నీతి నిజాయి తీగా బతికిన వాడే గొప్పవాడు అతన్ని మాత్రమే మనిషి అంటారు. కానీ అవినీతి పద్ధతుల్లో, అక్రమ సంపాదనకు ఎగబడి, మనిషిని మనిషిగా చూడకుండా, రాక్షస ప్రవృత్తిని ప్రదర్శించిన వాళ్లను మనుషులు అంటారనేది నిజం కాదు. అందుకే మనిషి బ్రతుకు కేవలం సంపద కోసం, సౌఖ్యం కోసం, వినోదం కోసం, విలాసం కోసం కాదు. గౌరవం కోసం, ఉనికి కోసం ,ప్రయోజనం కోసం, మానవతా విలువల కోసం, సమాజ ఉన్నతి కోసం అని గ్రహిస్తేనే మనిషి మారినట్లు మహోన్న తునిగా ఎదిగినట్లు లెక్క .
-పిల్లి రవి