South Industry Vs Bollywood: సౌత్ ఇండస్ట్రీ పైన ఇది బాలీవుడ్ పన్నాగమా…

ఇదే నేపథ్యంలో బాలీవుడ్ నుంచి ఒక్క హిట్టు కూడా రాకపోవడం అలానే వారు అనేక డిజాస్టర్లు తీయడం.. వారికి ప్రపంచ స్థాయిలో ఉన్న పేరుని కొంచెం తగ్గిస్తూ వచ్చాయి.

  • Written By: Vishnupriya
  • Published On:
South Industry Vs Bollywood:  సౌత్ ఇండస్ట్రీ పైన ఇది బాలీవుడ్ పన్నాగమా…

South Industry Vs Bollywood: ఒకప్పుడు ఇండియా సినిమా అంటే ప్రపంచం మొత్తం బాలీవుడ్ సినిమాలే అనుకునేవారు. కానీ రాజమౌళి ద్వారా సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా ఇండియా సినిమా అంతే మేము కూడా ఉన్నాము అని తెలియచెప్పాయి. ఆయన చేసిన బాహుబలి ఎంతటి కల విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఆ తరువాత వచ్చిన కేజిఎఫ్, కాంతారా, ఆర్ఆర్ఆర్ ఇలా ఎన్నో సినిమాలు సౌత్ ఇండస్ట్రీ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాయి.

ఇదే నేపథ్యంలో బాలీవుడ్ నుంచి ఒక్క హిట్టు కూడా రాకపోవడం అలానే వారు అనేక డిజాస్టర్లు తీయడం.. వారికి ప్రపంచ స్థాయిలో ఉన్న పేరుని కొంచెం తగ్గిస్తూ వచ్చాయి. మరి ఇందుకు బాలీవుడ్ వారు ఫీల్ అయ్యారో ఏమో తెలియదు కానీ.. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే మాత్రం సౌత్ ఇండియా పైన బాలీవుడ్ పెద్ద పన్నాగమే వేసినట్టు ఉంది.

అసలు విషయానికి వస్తే మన సౌత్ డైరెక్టర్లు ఇక్కడ సూపర్ హిట్లు ఇచ్చాక.. బాలీవుడ్ హీరోలతో కూడా ఈ మధ్య సినిమాలు చేస్తున్నారు. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగ తన తదుపరి చిత్రం బాలీవుడ్ లో ప్లాన్ చేసి అక్కడ కబీర్ సింగ్ అని సూపర్ హిట్ సినిమా అందించారు. కాగా ఎన్నో సంవత్సరాల ముందే మన సౌత్ డైరెక్టర్ మురగదాస్ హిందీ వారికి గజినీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇక ఇప్పుడు అట్లీ షారుఖ్ ఖాన్ కి తన కెరీర్ లో మరిచిపోలేని జవాన్ లాంటి సినిమా అందించారు.

ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. హిందీ డైరెక్టర్ ఓం రాత్ ప్రభాస్ కి అందించిన ఆది పురుష్ ఎంత ఘోర పరాజయం చవిచూసిందో మనకు తెలిసిందే.

మన సౌత్ డైరెక్టర్ లకు హిందీ హీరోలు ఆఫర్లు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకోగా.. మన తెలుగు హీరో మాత్రం హిందీ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి డిజాస్టర్ అందుకున్నారు. ఇక దీనిపైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అదేమిటి అనగా ఎంతోమంది సౌత్ సినిమా ప్రేక్షకులు మన తెలుగు దర్శకులు హిందీ వారికి ఇచ్చిన సూపర్ హిట్ సినిమాలను ఆది పురుష్ తో కంపేర్ చేసి.. ఇది బాలీవుడ్ వారు సౌత్ వారి పైన వేసిన పన్నాగమని కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు