Pawan Kalyan- Urvashi Rautela: పవన్ కోసం రంగంలోకి బాలీవుడ్ బ్యూటీ… అన్నయ్య చిందేసిన పిల్లనే!

ఊర్వశి రాతెలా వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవి జంటగా ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసింది. బాస్ పార్టీ సాంగ్ లో వీరు ఆడిపాడారు. అన్నయ్యతో ఆడిపాడిన ఊర్వశి రాతెలా ఎప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి లెగ్స్ షేక్ చేయనుంది. పవన్ పక్కన ఊర్వశి రాతెలా అనగానే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ బ్రో సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు.

  • Written By: SRK
  • Published On:
Pawan Kalyan- Urvashi Rautela: పవన్ కోసం రంగంలోకి బాలీవుడ్ బ్యూటీ… అన్నయ్య చిందేసిన పిల్లనే!

Pawan Kalyan- Urvashi Rautela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోరు మామూలుగా లేదు. ఆయన ఒకటికి నాలుగు చిత్రాలు పూర్తి చేస్తున్నారు. హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓ జీ, బ్రో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. వీటిలో బ్రో ముందుగా విడుదల కానుంది. బ్రో చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా షురూ చేశారు. ఒకపక్క చిత్రీకరణ జరుపుతూనే మరో ప్రక్క డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుతున్నారు. బ్రో మూవీలో మామా అల్లుళ్ళు పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ మూవీలో ఓ ఐటెం సాంగ్ ఉందని ఇప్పటికే సమాచారం ఉంది. ఐటెం సాంగ్ కోసం ఓ పబ్ సెట్ ఏర్పాటు చేశారట. ఈ సెట్లో పవన్ కళ్యాణ్ పై సాంగ్ షూట్ చేయనున్నారట. కాగా ఊర్వశి రాతెలా ఈ సాంగ్ చేస్తున్నారట. బాలీవుడ్ హాట్ బాంబుగా పేరున్న ఊర్వశి రాతెలాకు ఛాన్స్ వచ్చిందట. బ్రో మూవీ ఐటమ్ నంబర్ లో ఊర్వశి రాతెలా దుమ్ము రేపనున్నారునేది లేటెస్ట్ టాక్.

ఊర్వశి రాతెలా వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవి జంటగా ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసింది. బాస్ పార్టీ సాంగ్ లో వీరు ఆడిపాడారు. అన్నయ్యతో ఆడిపాడిన ఊర్వశి రాతెలా ఎప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి లెగ్స్ షేక్ చేయనుంది. పవన్ పక్కన ఊర్వశి రాతెలా అనగానే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ బ్రో సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు.

బ్రో తమిళ హిట్ మూవీ వినోదయ సితం రీమేక్. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. బ్రో జూన్ 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ మరోసారి మోడరన్ గాడ్ గా కనిపించనున్నాడు. కేవలం ఆరు నెలల వ్యవధిలో ఈ చిత్రం షూట్ చేశారు. రానున్న ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ నుండి ఉస్తాద్ భగత్ సింగ్, ఓ జీ చిత్రాలు విడుదల కానున్నాయి. హరి హర వీరమల్లు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు